అనిల్ రావిపూడి - మహేష్ కలయికలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ఫైనల్ దశకు చేరుకుంది. ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ తో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తున్న సరిలేరు టీం ఇప్పుడు మ్యూజిక్ తోనూ హడావిడి చేయబోతుంది. సరిలేరు నీకెవ్వరు పాటలు ఒక్కొక్కటిగా మార్కెట్ లో హల్ చల్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ బిగ్ రూమర్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే మహేష్ తో మహర్షి సినిమాని తెరకెక్కించిన వంశి పైడిపల్లి మళ్ళీ మహేష్ తో సినిమా చెయ్యడానికి మహేష్ కూడా కూడా తిరుగుతున్నాడు. లండన్ వెళితే లండన్ వెళ్ళాడు. క్రికెట్ చూడడనికి మహేష్ ఫ్యామిలీ వెళ్తే ఆక్కడికి వంశీ ఫ్యామిలీతో పాటుగా వెళ్లిపోయాయడు. ఇక మహేష్ పర్సనల్ పార్టీస్ లోను వంశి పైడిపల్లి ఫ్యామిలీతో హడావిడి చేస్తున్నాడు.
మహర్షితో మహేష్ కి బాగా దగ్గరైన వంశి పైడిపల్లి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా ఎడిటింగ్ విషయంలో జోక్యం చేసుకుంటున్నట్టుగా టాక్. సరిలేరు నీకెవ్వరు ఎడిటింగ్ టీంలో వంశీ కూడా ఉన్నాడని అంటున్నారు. అయితే వంశీ పైడిపల్లి మహర్షి సినిమాని దాదాపుగా 2.50 నిమిషాల నిడివి కట్ చేసి... సినిమా నెగెటివ్ పాయింట్స్ లో నిడివి ఉండేలా చేసాడు. మరి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఎడిటింగ్ విషయంలో వంశి జోక్యాన్ని మహేష్ ఎలా ఒప్పుకున్నాడో అంటున్నారు. మహేష్ కావాలనే వంశీని పిలిపించాడనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.