టాలీవుడ్ సినిమాలకు హిందీ హక్కులు కింద భారీ ధర పలుకుతున్నాయి. తెలుగు సినిమాలలోని యాక్షన్ హిందీ ప్రేక్షకులుకు బాగా నచ్చడంతో యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధించడంతో.. అక్కడి నిర్మాతలు తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్‌కి బాగా ధర పెడుతుండడంతో.... ఇక్కడి నిర్మాతలకు బాగా గిట్టుబాటు అవుతుంది. తాజాగా మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బిజినెస్ ఎప్పుడో మొదలైంది. సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇవ్వడంతో.. సినిమా ప్రమోషన్స్ ఒక వైపు, సినిమా బిజినెస్ ఒక వైపు పరిగెత్తిస్తున్నారు మేకర్స్.
అయితే మహేష్ మహర్షి సినిమాకి 20 కోట్ల మేర పలికిన హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్.. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి మాత్రం కాస్త తక్కువే పలికింది అంటున్నారు. మహర్షికి 20 కోట్ల హిందీ బిజినెస్ జరిగితే... ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి 15 కోట్లకి డీల్ సెట్ అయినట్లుగాగా తెలుస్తుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ డిజిటల్, డబ్బింగ్ హక్కులకింద మేకర్స్‌కి 15 కోట్లు వచ్చాయి. అయితే ఒకప్పుడు తెలుగు సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా గిరాకీ ఉండేది కానీ... ఈమధ్యన ఆ గిరాకీ తగ్గి.. అక్కడి నిర్మాతలు తెలుగు సినిమాలకు రేట్లు తగ్గించడంతో.. ఆ ఎఫెక్ట్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’పై పడింది. అయితే బాలీవుడ్ మేకర్స్ తెలుగు సినిమాల విషయంలో బాగా దెబ్బతినడంతో... తెలుగు సినిమాల డబ్బింగ్ రేట్లను ఆచి తూచి కొనుగోలు చేస్తున్నారట.