పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటుగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరగడమే కాదు.. ఇద్దరు నిర్మాతలు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీని అధికారికంగా ప్రకటించడంతో.. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ మీద, ఆయనతో చేసే హీరోయిన్ విషయంలో చాలా వార్తలు ప్రచారంలోకొచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ మధ్యలో తన రీ ఎంట్రీపై వస్తున్న వార్తలపైనా నిర్మాతల మీద మండి పడినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన రీ ఎంట్రీ విషయంలో ఎక్కడా క్లారిటీ ఇచ్చింది లేదు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. రాజకీయాల్లో బిజీ అయిన తాను మళ్ళీ సినిమాలు చేయడానికి టైం కేటాయించడం కుదిరే పనేనా అంటూ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కాస్త యాక్టివ్ గా ఉన్నాడు. అందుకే సినిమాలపై దృష్టి పడితే రాజకీయాలకు టైం కేటాయించడం కుదరదని పవన్ ఆలోచిస్తున్నాడట. పవన్ ఈ ఆలోచనపై నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది. పవన్ కి అడ్వాన్స్ లు ఇచ్చి.. దర్శకుడు కుదిరి సినిమా మొదలవుతుంది అని ఆనుకుంటున్న తరుణంలో పవన్ ఆలోచన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.