1300 మంది డాన్సర్స్‌తో విజువల్ ఫీస్ట్‌గా రూపొందిన ‘మర్ద్ మరాఠా’ సాంగ్‌ని విడుదల చేసిన ‘పానిపట్’ చిత్ర యూనిట్.
భారతదేశ చరిత్రలో పానిపట్ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్ యుద్ధం(14 జనవరి 1761 ) కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘పానిపట్’. స్టార్ డైరెక్టర్ అశుతోష్ గోవర్‌కర్ దర్శకత్వంలో సునీత గోవర్‌కర్, రోహిత్ షెలాత్కర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్ పాత్రలో అర్జున్ కపూర్, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్ పార్వతీబాయిగా, మరియు సంజయ్‌దత్ ఆహ్మద్ అబుద్‌అలీగా నటిస్తున్నారు. పురన్‌దాస్ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్‌తో పాటు థియేట్రికల్ ట్రైలర్ కి దేశ వ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా భారీ విజువల్స్, రీరికార్డింగ్, ఆర్ట్ వర్క్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ హిస్టారికల్ విజువల్ వండర్ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి ‘మర్ద్ మరాఠా’ సాంగ్ ని ముంబాయి లోని సిద్ది వినాయక మందిరంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘మర్ద్ మరాఠా’ సాంగ్ భారీ స్థాయిలో చిత్రీకరించబడింది, బ్యాక్ గ్రౌండ్‌లో పెద్ద గణేష్ విగ్రహం, పేష్‌వై వాతావరణం నేపథ్యంలో పూణేకు చెందిన లెజిమ్ నృత్యకారులు, అథెంటిక్ బుల్ డాన్సర్లతో సహా 1300 మందితో ఈ పాటను విజువల్ గా చాలా గ్రాండియర్ గా చిత్రీకరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను 13 రోజులలో కర్జాత్‌లోని శనివార్ వాడాలోని రీగల్ లైఫ్-సైజ్ సెట్‌లో చిత్రీకరించారు. ఈ సెట్‌ను ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ నిర్మించారు. హిందీ-మరాఠీ ఫీల్ ఉన్న పాట ఇది. ఈ పాటలో అర్జున్ కపూర్, కృతి సనోన్, మోహ్నీష్ బహల్, పద్మిని కొల్హాపురే నటించారు. అజయ్-అతుల్ ఈ గీతాన్ని స్వరపరిచారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ మాట్లాడుతూ - సాంప్రదాయ ట్యూన్ లోనే ఈ హై-ఎనర్జీ ట్రాక్‌ను కంపోజ్ చేయడం జరిగింది. ఈ పాట మరాఠా పాలన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. వయస్సు, సంగీతంలో అభిరుచితో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆనందించే పాటను సృష్టించాలని, ‘మర్ద్ మరాఠా’ను అందరికీ నచ్చే విధంగా కంపోజ్ చేశాం.. అన్నారు.
దర్శకుడు అశుతోష్ గోవారికర్ మాట్లాడుతూ.. మర్ద్ మరాఠా హై ఎనర్జీ సాంగ్. ఇది మరాఠా పాలన యొక్క సుసంపన్నతను తెలియజేస్తుంది. అలాగే పేష్వాసులు, మరాఠా సర్దార్లతో పాటు హిందు-ముస్లిం, ఆర్మీ రెజిమెంట్లకు ఇది ఒక ట్రిబ్యూట్‌లా ఉంటుంది. సాంప్రదాయ ట్యూన్‌ని జోడించి మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ అద్భుతంగా చేశారు. ఈ పాటలో రాజు ఖాన్ కొరియోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో నాకు ఇష్టమైన ట్రాక్ ఇది.. అన్నారు.
సంజయ్‌దత్, అర్జున్ కపూర్, కృతిసనన్, పద్మిని కొల్హాపురి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్, కెమెరా : సి.కె.మురళీధరన్, ఎడిటింగ్ : స్టీవెన్ బెర్నార్డ్, ప్రొడక్షన్ డిజైనర్ : నితిన్ చంద్రకాంత్ దేశాయ్, యాక్షన్ : అబ్బాస్ అలీ మొఘల్, బ్యానర్స్ : అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్, విజన్ వరల్డ్ ఫిల్మ్స్, ప్రొడ్యూసర్స్ : సునీతా గోవారికర్, రోహిత్ షెలాత్కర్. దర్శకత్వం : అశుతోష్ గోవారికర్.