Advertisement
Google Ads BL

‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ఫస్ట్‌ లుక్‌


బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ సుధాకర్‌రెడ్డి విడుదల చేశారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘స్నేహితులందరూ కలిసి చేసిన చిత్రమిది. ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

వీరి నాయుడు మాట్లాడుతూ ‘‘సినిమా మార్కెట్‌లో నన్ను ‘పూర్వి’ రాజు అంటారు. విశాఖలో పూర్వి పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ స్థాపించి, పాతిక సంవత్సరాల నుండి విజయవంతమైన చిత్రాలు చాలా విడుదల చేశాను. మా అబ్బాయి శ్రీనివాస్‌, అతడి మిత్రుడు బాలు, ఇద్దరి స్నేహితులు కలిసి ఈ సినిమా చేశారు. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్‌ భరత్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘ఫస్ట్‌ లుక్‌ ట్రెండీగా, కమర్షియల్‌గా ఉంది. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ సినిమాకు మంచి కలెక్షన్స్‌ రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘సుధాకర్‌రెడ్డిగారికి చాలా చాలా థ్యాంక్స్‌. వీరి నాయుడుగారు మాకు ఎంతో అండగా ఉన్నారు. వాళ్లబ్బాయి శ్రీనివాస్‌, మేం కలిసి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి, ఈ సినిమా చేశాం. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రాందాస్‌ పాల్గొన్నారు.

నటీనటులు:

ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:

అసోసియేట్‌ డైరెక్టర్‌: లక్కీ బెజవాడ, ఎడిటర్‌: బొంతల నాగేశ్వర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎల్‌ఎన్‌ వారణాసి, వైజేఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: నేహా మురళి, రఘురామ్‌ ఎరుకొండ, ఆర్ట్‌ డైరెక్టర్‌: గాంధీ నడికుడికర్‌, సినిమాటోగ్రఫీ: శేఖర్‌ గంగమోని, సంగీతం: వికాస్‌ బడిజ, కో–డైరెక్టర్‌, డైలాగ్స్‌: విజయ్‌ కామిశెట్టి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.

‘Anukunnadhi Okkati Ayyindhi Okkati’ First Look unveiled :

‘Anukunnadhi Okkati Ayyindhi Okkati’ First Look Launch details 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs