Advertisement
Google Ads BL

మెగా బ్రదర్స్‌ మూవీస్‌పైనే స్టార్ హీరో కన్ను!


ఇదేంటి.. మెగా బ్రదర్స్‌తో సినిమాలు చేయాలని డైరెక్టర్లు కన్నేస్తారు కానీ.. ఇదేంటి కాస్త తేడా ఉందని అనుకుంటున్నారా..? అవును మెగా మూవీస్‌పైనే స్టార్ హీరో కన్ను పడింది! అదెలాగో.. అసలు ఆయనెవరో..? మెగా మూవీస్‌పైనే కన్నెందుకు పడిందో తెలియాలంటే ఈ కథనం చదివేయాల్సిందే మరి. ఒకప్పుడు డైరెక్టర్స్ సినిమా పేర్లు.. వాళ్లు రాసిన స్టోరీలను ఇప్పటికీ మరిచిపోలేం. ఎందుకంటే ఆ పేర్లు.. కథకు ఉండే రేంజ్ అది కాబట్టి ఇప్పటికీ బతికే ఉన్నాయ్.. మనందరమూ మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు.. ఆ సినిమాలు ఆయా హీరోలకు ఓ మైల్‌స్టోన్‌గా నిలిచి.. స్టార్‌లను చేశాయ్ గనుకు ఇప్పటికీ వాటి గురించి చర్చించుకుంటున్నాం.

Advertisement
CJ Advs

అలాంటిది ఈ రోజుల్లో పాత సినిమాల పేర్లే మళ్లీ రిపీట్ చేసేస్తున్నారు. అంటే అదేదో డైరెక్టర్స్‌కు క్రియేటీ ఉందా..? లేదా..? కొత్తదనం కోరుకోరేం..? పాత చింతకాయ పచ్చడిలా అవే ఎందుకు..? అనేది ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా. ఇక అసలు విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి సినిమాల పేర్లు ఎలా ఉంటాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వినడానికి.. చూడటానికి కాస్త వెరైటీగా అనిపించినా అప్పట్లో ట్రెండ్ అవే. అయితే ఆ టైటిల్స్ కోసం ఇప్పటి స్టార్ హీరోలు.. దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ సినిమా టైటిల్స్.. ‘గ్యాంగ్ లీడర్’ను నేచురల్ స్టార్ నానీ.. ‘ఖైదీ’ని తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన కార్తీ వాడేశారు. ఇంతవరకూ చిరు సినిమాలే కానీ.. ఇప్పుడు మెగా బ్రదర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా పేర్లపై కూడా డైరెక్టర్లకు కన్నుపడింది.

ఇప్పటికే కార్తీ ‘ఖైదీ’ టైటిల్‌తో అభిమానుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్టయ్యాడు. ఈ సినిమాతో కార్తీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతేకాదు సినిమా టైటిల్ కూడా బాగా అచ్చిరావడంతో ఇక మెగా హీరోల సినిమాలపైనే ఆయన అచ్చంగా కన్నేశాడట. పవన్‌ సినీ కెరీర్‌ను పీక్ తీసుకెళ్లిన ‘తమ్ముడు’ సినిమా టైటిల్‌ను తన తదుపరి మూవీకి టైటిల్‌ అని కార్తీ ఫిక్సయిపోయాడట. ఈ చిత్రాన్ని దృశ్యం లాంటి వైవిధ్య కథను ఇండస్ట్రీకి పరిచయం చేసిన జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సిస్టర్ సెంటిమెంట్‌ ఉంటుందట. ఇప్పటికే తమిళ్‌లో ‘తంబీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన డైరెక్టర్.. తెలుగులో ‘తమ్ముడు’ పెట్టాలని భావిస్తున్నాడట. 

వీలైనంత త్వరగా సినిమాను ముగించేసి తంబీని క్రిస్మస్ బరిలో దించాలని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటి వరకూ ఇవే.. మున్ముంథు మరెన్నీ మెగా బ్రదర్స్ టైటిల్స్ వాడేస్తారో ఏమో..! మొత్తానికి చూస్తే ఎవరేమనుకున్నా.. ఎన్నెన్ని అనుకున్నా.. కార్తీ మాత్రం మెగా బ్రదర్స్‌ను నేనొదలా అంటున్నాడన్న మాట. మెగాస్టార్ ఖైదీ కరెక్టుగానే సినీ ప్రియులు కనెక్ట్ అయ్యింది సరే.. తమ్ముడు ఏ మాత్రం సెట్ అవుతుందో వేచి చూడాలి మరి. 

Star Hero Eyes On Mega Brothers Movies!:

Star Hero Eyes On Mega Brothers Movies!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs