Advertisement
Google Ads BL

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’లో రష్మీ ఇందుకే నటించలేదా!?


జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ  హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామికవేత్త కె. శేఖర్‌ రాజు నిర్మించిన చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ 10 మిలియన్‌ వ్యూస్‌కి పైగా సాధించి ట్రెండింగ్‌లో నిలిచిందంటే ఈ చిత్రం పట్ల ఆడియన్స్‌లో ఎంతటి అటెన్షన్‌ ఉందో అర్థమవుతోంది. ఇంతవరకూ అంతా ఓకే గానీ సుధీర్‌పై ఇప్పుడు జబర్దస్త్ వీక్షకులు, అభిమానులు, నెటిజన్లలో పెద్ద అనుమానం మొదలయ్యింది.

Advertisement
CJ Advs

బుల్లితెర హాటెస్ట్ గాసిప్స్‌లో సుధీర్- రష్మీ టాప్‌లో నిలిచారు కదా.. వీళ్లిద్దరూ కాకుండా ధన్య ఎందుకు నటించినట్లు..? అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది..? వీరిద్దరికీ గ్యాప్ వచ్చిందా..? లేకుంటే మరేమైనా జరిగిందా..? మొదట రష్మీని సంప్రదించినప్పటికీ ఆమే రిజక్ట్ చేసిందా..? ఇలా పలు ప్రశ్నలు ప్రేక్షకుల్లో మదిలో మెదులుతున్నాయ్. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ అటు సుధీర్ గానీ.. ఇటు హాట్ యాంకర్ రష్మీ కానీ చెప్పలేరు కానీ.. ఫిల్మ్‌నగర్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

వాస్తవానికి మొదట రష్మీనే దర్శకనిర్మాతలు సంప్రదించినప్పటికీ ‘సుధీర్ సరసన నేనా.. అస్సలు నటించను బాబోయ్’ అని చెప్పేసిందట. ఇక చేసేదేమీ సుధీర్‌నే రంగంలోకి దించగా.. ‘నీకో దండం బాబూ నీతో నేను నటించను.. నటించాలనే ఉత్సాహం కూడా నాకు లేదు. ఇప్పటి వరకూ మన గురించి పుకార్లు చాలు ఇక ముందు కూడా ఎందుక’ని తేల్చి చెప్పేసిందట. అయితే పదేపదే అడగటంతో ఇక వెళ్లు బాబూ.. అని దండం పెట్టి మరీ సుధీర్‌ను పంపించేసిందట. ఇదీ అసలు కథంట. 

రష్మీ ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక కొత్తవారెవ్వరూ దొరక్క ధన్యను చిత్రబృందం ఫిక్స్ చేసిందట. కాగా.. వీళ్లి్ద్దరూ ప్రేమించుకున్నారని కొందరు వాదిస్తే, కేవలం జబర్దస్త్  వరకే వాళ్ల బంధం పరిమితం అంటూ మరికొందరు వాదిస్తుంటారు. మొత్తానికి చూస్తే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ విషయంలో మరోసారి హాట్ టాపిక్ అయ్యారన్న మాట. ‘సుడిగాలి’ అనే తోక సుధీర్‌కు జబర్దస్త్ పరంగా బాగానే కలిసొచ్చింది.. సాఫీగానే సాగిపోతోంది... మరి ‘సాఫ్ట్‌వేర్’ సెట్ అవుతుందో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Why Anchor Reshmi Didnt Act With Sudheer In Software Sudheer Movie:

Why Anchor Reshmi Didnt Act With Sudheer In Software Sudheer Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs