Advertisement
Google Ads BL

‘అల వైకుంఠపురంలో..’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్‌ను ఏలుతున్న పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన లుక్స్, సాంగ్స్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. లుక్స్ అదుర్స్ అనిపించగా.. సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్‌లో చూసిన రింగ్‌ టోన్స్ మొదలుకుని మ్యూజిక్ ప్లేయర్ వరకూ ‘సామజవరగమన’..,‘రాములో రాముల’ సాంగ్సే వినిపిస్తున్నాయి. ప్రమోషన్స్ పరంగా బన్నీ‘అల.. ’ గట్టిగానే వీస్తోంది. ఇప్పటికే బన్నీ, మెగాభిమానులకు మంచి కిక్కించే సాంగ్స్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం.. ఇంతకు మించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే.. బన్నీ పాత్ర ఎలా ఉండబోతోంది..? పూజా పాత్రేంటి..? సీనియర్ నటి టబు పాత్రేంటి..? అనేదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కానీ పుకార్లు మాత్రం అటు నెట్టింట్లో.. ఇటు టాలీవుడ్ నగర్‌లో గట్టిగానే షికార్లు చేస్తున్నాయ్. అయితే ఇప్పటికే బన్నీ పాత్ర అలా ఉంటుంది.. ఇలా ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. అది ఎంతవరకు నిజమన్నది చిత్రబృందానికే ఎరుక. తాజాగా సినిమాలో పూజా పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అయితే ఇది మాత్రం పుకారు కాదండోయ్ స్వయానా ఆ ముద్దుగుమ్మే తన పాత్రను బయటపెట్టుకుంది.

‘ఓ కార్పొరేట్ కంపెనీలో నేను, బన్నీ పనిచేస్తుంటాము. ఆఫీస్‌లో బన్నీకి నేను బాస్‌గా కనిపించబోతున్నాను. ఈ క్రమంలో మా ఇద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ హైలైట్‌గా నిలుస్తుంది’ అని చెప్పుకొచ్చింది. అంటే ఇప్పటి వరకూ సాంగ్సే కాదు.. ఇలా నటీనటులతో చిన్నపాటి లీకులిస్తూ సినిమాపై మరింత ఇంటెన్షన్ పెంచడానికి చిత్రబృందం ప్లాన్ చేసిందన్న మాట. అల్లు అర్జున్.. పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ‘సామజ వరగమన’.. ‘ రాములో రాముల’ అనే రెండు పాటలు మెగా ఫ్యాన్స్‌కు మంచి కిక్కించాయి.. సినిమా రిలీజ్ కాకమునుపే సూపర్ డూపర్ హిట్టయ్యాయి. మరి బన్నీకి బాస్‌గా.. లవ్ ట్రాక్‌ వ్యవహారాలు సినిమాకు ఏ మాత్రం ప్లస్ అవుతాయో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే మరి.

Interesting Update From Bunny ‘Ala Vaikuntapuramlo..’:

Interesting Update From Bunny ‘Ala Vaikuntapuramlo..’  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs