Advertisement
Google Ads BL

‘విజయ్ సేతుపతి’.. పవన్ కోసం రాసుకున్నాడంట!


 

Advertisement
CJ Advs

విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా విజయా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ‘సంగ తమిళ్’ మూవీని హార్షిత మూవీస్ వారు తెలుగులో ‘విజయ్ సేతుపతి’గా ఈ నెల 15న విడుదల చేయనున్నారు. ఈ జనరేషన్ హీరోలలో ‘విజయ్ సేతుపతి’కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ‘సైరా’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ సేతుపతి మూవీ తమిళ, తెలుగులలో ఒకేసారి రిలీజ్ అవుతున్న మూవీ ‘విజయ్ సేతుపతి’. తెలుగు నేటివిటీ‌కి సరిపోయే కథా, కథనాలతో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కలసి వస్తున్న ‘విజయ్ సేతుపతి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్ర యూనిట్ సమక్షంలో జరిగింది. నాజర్, నివేద పేతురాజ్, అశుతోష్ రాణా లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీ  విజయ్ సేతుపతిని

తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని చిత్రయూనిట్ నమ్మకం. విద్యావేత్తగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రావూరి. వి. శ్రీనివాస్ తన తోటి విద్యావేత్తలు కంచర్ల శ్రీకాంత్ చౌదరి, ప్రకాష్ రెడ్డి, చక్రవర్తి, వెంకట రాజు దంపతుల చేతుల మీదుగా ‘విజయ్ సేతుపతి’ పాటలను విడుదల చేయించారు. తమ సహా విద్యావేత్త నిర్మాతగా సక్సెస్ అవ్వాలని

అతిథులు కోరుకున్నారు. సీనియర్ దర్శకుడు సముద్ర ట్రైలర్‌ని లాంచ్ చేయగా, డిస్ట్రిబ్యూటర్స్ నారాయణ రెడ్డి, సతీష్, సజ్జులు టీజర్‌ని లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా మాటల రచయిత ‘మల్లూరి వెంకట్’ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత రావురి వి. శ్రీనివాస్‌కి మంచి అభిరుచి ఉంది. ఈ సినిమా టైటిల్ని ‘విజయ్ సేతుపతి’గా ఆయనే డిసైడ్ చేసారు. వెన్నెల కంటి, ఆయన తనయుడు రాకేంద్‌మౌళి పాటలకు తెలుగదనం అద్దారు. విజయ ప్రొడక్షన్స్‌లోని విజయం, హీరో పేరులోని విజయం కలసి నిర్మాతకు డబుల్ సక్సెస్‌ని అందించాలని కోరుకుంటున్నాను. తెలుగు నేటివిటీకి బాగా దగ్గరగా ఉండే సినిమా ఇది. ఇందులో మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు విజయ్ చందర్‌కి నిర్మాత శ్రీనివాస్‌కి థ్యాంక్స్’’ అన్నారు.

నగేష్ నారదాసి మాట్లాడుతూ.. ‘‘అందరి పేరులోని విజయం సినిమా రిజల్ట్స్‌లో కనిపించాలి. ప్రేక్షకులకు భాషతో పనిలేదు సినిమా బాగుంటే తప్పకుండా పెద్ద విజయం అందిస్తారు.

రీసెంట్‌గా వచ్చిన ఖైదీ, విజిల్ సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో చూసాం. అదే దారిలో విజయ్ సేతుపతి కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ‘విజయ్ సేతుపతి’లో పుష్కలంగా ఉన్నాయి..’’ అన్నారు.

ప్రొడ్యూసర్ రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటి నుండో సినిమా రంగంలోకి రావాలని అనుకుంటున్నాను. స్ట్రైయిట్ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న టైంలో మిత్రుడు వెంకట్ ద్వారా ఈ సినిమా గురించి తెలుసుకున్నాను. విజయా ప్రొడక్షన్ వారిని కలుసుకొని ఈ సినిమా తెలుగు రైట్స్‌ని పొందాను. ఒక మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు విజయ్, మ్యూజిక్ దర్శకుడు వివేక్ - మెర్విన్ చాలా బాగా పనిచేసారు. అచ్చ తెలుగు సినిమా లాగానే ‘విజయ్ సేతుపతి’ ఉంటుంది’’ అన్నారు.

దర్శకుడు విజయ్ చందర్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాలాగా ‘విజయ్ సేతుపతి’ ఉందని అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథ. ఎ యమ్ రత్నం గారు పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా మొదలవుతుందనే వార్తలు వస్తున్నప్పుడు ఎ యమ్ రత్నం గారికి ఈ కథను చెప్పేందుకు ప్రయత్నించాను. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆ ప్రయత్నం నేరవేరలేదు. తర్వాత విజయా ప్రొడక్షన్ వారికి ఈ కథను చెప్పడం జరిగింది. వారికి కథ నచ్చడంతో విజయ్ సేతుపతి‌ని సజెస్ట్

చేసారు. విజయ్ సేతుపతి ఈ కథ వినగానే చాలా మాస్ ఎలిమెంట్స్‌తో కథ ఉంది అని మెచ్చుకున్నారు. తమిళంలో ఆయనకు మాస్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఈ కథను ఆయన

బాగా ఎంజయ్ చేసి చేసారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

సీనియర్ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. ‘‘విజయ్ సేతుపతిలో ఎనర్జీ లెవల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. విజయ్ సేతుపతికి ఈ సినిమాతో తెలుగులో స్టార్ డమ్ వస్తుందని నమ్ముతున్నాను. ఏ దర్శకుడికయినా పవన్ కళ్యాణ్ తో పనిచేయాలని ఉంటుంది. ఈ సినిమా తర్వాత విజయ్ చందర్ కి పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశం వస్తుందని నమ్ముతున్నాను. చిత్ర యూనిట్‌కి అభినందనలు... సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

విజయసేతుపతి, రాశీఖన్నా, నివేద పేతురాజ్, నాజర్, అశుతోష్ రాణా, రవికిషన్ శుక్లా, తులసి తదితరులు నటించిన ఈ చిత్రానికి

సాంకేతిక వర్గం :

సంగీతం: వివేక్ - మెర్విన్, సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్, స్టంట్స్: అనల్ అరసు, కొరియోగ్రాఫీ: రాజుసుందరం, శాండి, దస్త, ఎడిటింగ్: ప్రవీణ్ కె. ఎల్. డైలాగ్స్: మల్లూరి వెంకట్, నిర్మాత రావురి. వి. శ్రీనివాస్, దర్శకత్వం: విజయ చందర్

Vijay Sethupathi Movie Pre Release Event Highlights:

Celebrities speech at Vijay Sethupathi Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs