Advertisement
Google Ads BL

ఎం స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై 3 చిత్రాలకు సన్నాహాలు


మొవ్వ విజ‌య చౌద‌రి నిర్మాత‌గా ఎం స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై మూడు చిత్రాలకు సన్నాహాలు  

Advertisement
CJ Advs

ఈ మధ్యనే అనసూయతో ‘క‌థ‌నం’ సినిమాను తీసిన నిర్మాత‌ల్లో ఒక‌రైన మొవ్వ విజ‌య చౌద‌రి నూతనంగా ఎం స్క్రీన్స్ బ్యాన‌ర్‌ను నెలకొల్పారు. తాజాగా ఆ బ్యానర్ పై మూడు సినిమాలు నిర్మించేందుకు సంకల్పించారు. ఈ సందర్బంగా ఆ చిత్రాల వివరాలను నిర్మాత మొవ్వ విజ‌య చౌద‌రి తెలియజేస్తూ.. ‘‘యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకునే వైవిధ్య భరిత చిత్రాలను రూపొందించాలనే సదాశయంతో ఎం స్క్రీన్స్ బ్యాన‌ర్‌ను ప్రారంభించాం. అందులో భాగంగా తొలుత మా బ్యాన‌ర్‌లో మూడు సినిమాలను నిర్మిస్తున్నాం. డిసెంబ‌ర్ రెండో వారంలో తొలి చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో ‘నాట‌కం’ ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా న‌టిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ రావి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు  అలాగే ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన స్మ‌ర‌ణ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రాన్ని నిర్మించనున్నాం. ఇక ప‌రుశురాం వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ఆర్‌.సురేష్ ద‌ర్శ‌క‌త్వంలో మూడో చిత్రాన్నిరూపొందిస్తాం. ఈ మూడు చిత్రాల‌కు న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల మిగతా వివరాలను త్వరలో తెలియ‌జేస్తాం’’ అన్నారు. 

బ్యాన‌ర్‌: ఎం స్క్రీన్స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: ర‌విశంక‌ర్‌, కొండ బ‌త్తుల నాగ‌శేఖ‌ర్‌, నిర్మాత‌: మొవ్వ విజ‌య చౌద‌రి

M Screens Banner Announces 3 Films:

Movva Vijaya Chowdary Announces 3 Films in Her M Screens Banner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs