Advertisement
Google Ads BL

‘సరిలేరు నీకెవ్వరు’ కోసం అనీల్ భారీ ప్లాన్!


టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ చిత్రానికి సంబంధించిన చిన్నపాటి లుక్స్ తప్ప సాంగ్ కానీ.. టీజర్, ట్రైలర్ ఏమీ వదల్లేదు. దీంతో మహేశ్ వీరాభిమానులు, ఘట్టమనేని ఫ్యాన్స్ తీవ్ర అసంతృ‌ప్తితో రగిలిపోతున్నారు.! అయితే.. అనీల్ రావిపూడి ఏదో ఒక మ్యాజిక్ తప్పకుండా చేస్తాడని మరో గట్టి నమ్మకం ఫ్యాన్స్‌లో ఉంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకూ ప్రమోషన్స్ మాత్రం నిల్. అయితే ఇదే సినిమాతో పాటు రిలీజ్ అయ్యే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘అల వైకుంఠపురంలో..’ మాత్రం ప్రమోషన్స్‌ షురూ చేసింది.. అంతేకాదు చిత్రబృందం రిలీజ్ చేసిన లుక్స్ మొదలుకుని సాంగ్స్‌వరకు అన్నీ ట్రెండింగ్‌లో నిలిచాయి. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. దీంతో మహేశ్ ఫ్యాన్స్‌లో మరింత ఆందోళన పెరిగిపోతోందట.

Advertisement
CJ Advs

అయితే ఏ మాత్రం ప్రమోషన్స్‌ షురూ చేయనప్పటికీ అనీల్ మాత్రం ట్విట్టర్ వేదికగా అప్పుడప్పుడు పక్కనోళ్ల సినిమాపై సెటైర్స్ వేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తుండటంతో అసలు  ఆయనది కాన్ఫిడెన్సా లేకుంటే.. ఓవర్ కాన్ఫిడెన్సా అనేది తెలియక ఫ్యాన్స్ తికమకపడుతున్నారట!. వాస్తవానికి అనీల్‌ తన సినిమాలకు పెద్దగా ప్రమోషన్స్ చేయరు.. చేయాలని సాహసించరు కూడా. ఎందుకంటే సినిమాలో సబ్జక్ట్ ఉంటే చాలు ఓ.. ప్రమోషన్స్.. ప్రమోషన్స్‌ అని ఎగిరెగిరి పడనక్కర్లేదని భావిస్తుంటారట. ఇందుకు అనీల్ తెరకెక్కించిన ‘పటాస్’, ‘సుప్రీం’, ‘రాజాది గ్రేట్’, ‘ఎఫ్2’ సినిమాలో సాక్ష్యం. ఇప్పటి వరకూ తెరకెక్కించింది నాలుగు సినిమాలో అయినప్పటికీ అన్నీ హిట్టే. 

ఇవన్నీ ఒక ఎత్తయితే.. మహేశ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గట్టిగానే అభిమానులు ఉన్నారు. సూపర్‌స్టార్ సినిమా అంటే ఆయన అభిమానులకు ఇక పూనకమే!. చిత్రబృందం ప్రమోషన్స్ చేసినా పెద్దగా చేయకపోయినా సినిమాలో విషయముంది.. కచ్చితంగా సక్సెస్ అవుతామని గట్టిగానే డైరెక్టర్ నమ్ముతున్నాడట. అంతేకాదు.. డిసెంబర్ మధ్యలో నుంచి భారీగా ప్రమోషన్ ప్లాన్  చేయాలని చిత్రబృందానికి మహేశ్ అండ్ నిర్మాత చెప్పారట. ఆ ప్లాన్ ఇంతవరకూ ఎవరికీ రాకూడనిదై ఉండాలని దర్శకుడికి చెప్పారట. దీంతో డైరెక్టర్ భారీ ప్లాన్ వేశాడట. 

మరి ఆ ప్లాన్ ఎలా ఉంటుందో..? ఏంటో..! ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ఫ్యాన్స్‌ ఆ రోజు కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారట. కాగా.. ఇన్ని రోజులు ప్రమోషన్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్ ఇదొక తియ్యటి శుభవార్తేనన్న మాట. మొత్తానికి అనీల్‌కు ఉన్న ఆ నమ్మకం, భారీ ప్లాన్ ‘సరిలేరు నీకెవ్వరు’ అని సాటి సినిమాలతో అనిపించుకుంటుందో.. లేకుంటే ‘సరిలేరును.. అలా’ ఢీకొట్టేస్తుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే మరి.

Director Anil Raavipudi Huge Plan For Sarileru Neekevvaru!:

Director Anil Raavipudi Huge Plan For Sarileru Neekevvaru!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs