Advertisement
Google Ads BL

పూరి దగ్గర యాటిట్యూడ్ చూపిస్తాడా..!


విజయ్ దేవరకొండ ఇదివరకు అంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం హిట్స్‌తో కాస్త యాటిట్యూడ్ చూపించేసాడు. ఆతర్వాత తనతో పనిచేసిన దర్శకులెవరికి విజయ్ దేవరకొండ స్వేచ్ఛనివ్వలేదనే టాక్ ఉంది. అందులో నోటా దర్శకుడు, తాజాగా డియర్ కామ్రేడ్ దర్శకుడితో పాటుగా టాక్సీవాలా దర్శకుడికి కూడా విజయ్ దేవరకొండ స్వేచ్ఛనివ్వలేదని ప్రచారం జరిగింది. సినిమాల మేకింగ్ విషయంలో విజయ్ దేవరకొండ వేళ్ళు పెడతాడని, చాలా మార్పులు చేర్పులు చేపిస్తాడనే ప్రచారం ఉంది. డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు అయితే ఈ ప్రచారం మాత్రం బాగా జరిగింది.

Advertisement
CJ Advs

తాజాగా పూరి జగన్నాధ్ తో ఫైటర్ సినిమాతో సెట్స్ మీదకెళ్ళబోతున్న విజయ్ దేవరకొండ ఆటలు సాగేలా లేవు అంటున్నారు. ఎందుకంటే పూరి జగన్నాధ్ కి తన కథలో కానీ, తన డైరెక్షన్ లో కానీ వేళ్ళు పెట్టే హీరోలంటే నచ్చరు. అందుకే పవన్‌తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసాక.. పవన్ కళ్యాణ్ తన డైరెక్షన్‌లో చేతులు పెట్టాడని.. ఇక పవన్ తో సినిమా చెయ్యనని చెప్పాడు. మరి ఫైటర్ విషయంలో విజయ్ దేవరకొండ గనక పూరి జగన్నాధ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేతులు పెడితే పూరి ఊరుకునే రకం కాదు. మరి పూరి దగ్గర విజయ్ దేవరకొండ ఆటలు సాగేలా లేవు అంటున్నారు.

Vijay Deverakonda Fighter Movie with Puri Jagannadh:

Vijay Devarakonda attitude will not work at Puri Jagannadh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs