Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ఈ కండీషన్స్ ఏమిటి?


నిర్మాతలను టెన్షన్ పెడుతున్న హీరో అంటూ మొన్నామధ్యన మహేష్ పై సోషల్ మీడియాలో భీభత్సంగా ప్రచారం జరిగింది. పారితోషకంతో పాటుగా, లాభాల్లో వాటా అంటూ మహేష్ నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాడని అన్నారు. ఇక మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాడని న్యూస్ ప్రచారం లోకొచ్చింది. అలా వైకుంఠపురములో సినిమా మొదలైనప్పవుడే.. అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్‌తో మాట్లాడి మరీ హారిక హాసిని వారిని ఒప్పించి తన ఓన్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌ని భాగస్వామ్యం చేసాడు. కేవలం అల్లు అర్జున్ పట్టుబట్టడం వల్లనే హారిక వారు గీతా ఆర్ట్స్‌ని కలుపుకున్నారు.. అప్పట్లో ఆ న్యూస్ తెగ హైలెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇప్పుడు సుకుమార్‌తో తాను చెయ్యబోయే సినిమా విషయంలోనూ అల్లు అర్జున్ ఇదే రకంగా నిర్మాతలైన మైత్రి మూవీస్ ని ఇరుకున పెట్టినట్లుగా టాక్. అల వైకుంఠపురములో సినిమాకి గీతా ఆర్ట్స్‌ని ఇరికించినల్టుగా... సుకుమార్ ఓన్ బ్యానర్ లాంటి మైత్రి మూవీస్ తో పాటుగా సుకుమార్ సినిమాని నిర్మిస్తున్న మరో సంస్థ ముత్తంశెట్టి మీడియా‌తో పాటుగా తన ఓన్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌ని కూడా భాగస్వామ్యం చెయ్యాలనే కండిషన్ పెట్టినట్లుగా టాక్. సుకుమార్ తో సినిమా కథ వలన లేట్ కాలేదని... అల్లు అర్జున్ కండిషన్ వలనే లేట్ అయ్యిందనే టాక్ వినబడుతుంది. మరి త్రివిక్రమ్ - హారిక వారు ఒప్పుకున్నట్లుగా సుకుమర్ - మైత్రి వారు అల్లు అర్జున్ కండిషన్‌కి ఒప్పుకుంటారో.. లేదో.. తెలియాల్సి ఉంది.

Allu Arjun Conditions to His Directors and Producers:

Allu Arjun Sketch for Geetha Arts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs