Advertisement
Google Ads BL

ఈ రెండింటిలో చిరు సినిమాకు టైటిల్ ఏదో!?


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ రిలీజ్ తర్వాత.. ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరుగాంచిన కొరటాల శివతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి చిత్రానికి సంబంధించి ‘ఇదిగో కథ..’ ‘మ్యూజిక్ డైరెక్టర్ మారారు..’ ‘దేవీ శ్రీని పక్కనెట్టి బాలీవుడ్‌ను పట్టుకొచ్చారు..’, ‘ఇదిగో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది..’ ఇలా పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. అయితే తాజాగా ఇంతకు మించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా వస్తున్న రూమర్ నిజమే అయితే మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులుండవేమో మరి.

Advertisement
CJ Advs

అదేంటంటే.. సినిమా టైటిల్ ఫిక్సయ్యిందని వార్తలు గుప్పుమంటున్నాయ్. సామాజిక అంశాలపైనే ఎక్కువగా కథలను తెరకెక్కించే కొరటాల.. చిరు కోసం అదే రకమైన కథ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు కథకు సరిపోయేలా ‘గోవిందా హరి గోవిందా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ప్రస్తుతం ఈ టైటిల్ వ్యవహారం అటు నెట్టింట్లో.. ఇటు ఫిల్మ్‌నగర్‌లో బాగా వైరల్ అవుతోంది. ఇందుకు కారణం.. ఇందులో చిరు డ్యూయల్ రోల్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే. ఇందులో ఒక పాత్రకు ‘గోవింద్’ అని.. మరో పాత్రకు ‘హరి’ అని పేర్లు కూడా ఫిక్స్ చేశారట.

అంతేకాదు.. మరో పుకారు సైతం గట్టిగానే వినిపిస్తోంది. మొదట ‘గోవిందా హరి గోవిందా’ అనే టైటిల్‌ను అనుకున్నప్పటికీ ఆ తర్వాత ‘గోవిందా ఆచార్య’ను ఫిక్స్ అయ్యారట. ఇందులో నక్సలైట్ పాత్రకు గోవింద్‌గా.. ప్రొఫెసర్ పాత్రకు ‘ఆచార్య’ అని మరో పాత్రకు ఫిక్స్ అయ్యారని టాక్ నడుస్తోంది. అయితే ఈ గోవిందా అనే పేరు పెట్టడం వెనుక.. దేవాలయాల పేరిట దోపిడీ కథాంశం ఉండటమేనట. అయితే.. ఈ రెండింటిలో కొరటాల ‘గోవిందా హరి గోవిందా’ కు ఫిక్స్ అవుతాడా లేదా.. ‘గోవిందా ఆచార్య’తో ముందుకు సాగుతాడా..? లేదా ఈ రెండూ కాకుండా మూడో టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా..? అనేది వేచిచూడాల్సిందే మరి.`>

Chiru-Koratala Movie Tittle Fix.. Here Details..!:

Chiru-Koratala Movie Tittle Fix.. Here Details..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs