Advertisement
Google Ads BL

పాట చిత్రీక‌ర‌ణ‌లో బాలయ్య ‘రూల‌ర్‌’


పాట చిత్రీక‌ర‌ణ‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ‘రూల‌ర్‌’

Advertisement
CJ Advs

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం ‘రూల‌ర్‌’. సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘రూల‌ర్‌’. రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాల‌కృష్ణ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. వీటికి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన మ‌రో కొత్త లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ లుక్‌లో బాల‌కృష్ణ చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా క‌న‌ప‌డుతున్నారు. పర్టిక్యులర్ గా ఈ లుక్ కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు.  

‘రూల‌ర్‌’ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పుడు మున్నార్‌లో ఓ మెలోడి సాంగ్‌ను బాల‌కృష్ణ‌, వేదిక‌ల‌పై చిత్రీక‌రిస్తున్నారు.  ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట‌ను రాశారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైయ్యాయి. ‘జైసింహా’ వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

నటీనటులు:

నందమూరి బాలకృష్ణ

సోనాల్ చౌహాన్

వేదిక

ప్రకాశ్ రాజ్

భూమిక చావ్లా

జయసుధ

షాయాజీ షిండే

నాగినీడు

సప్తగిరి

శ్రీనివాస్‌రెడ్డి

రఘుబాబు

ధన్‌రాజ్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్

నిర్మాత: సి.కల్యాణ్

కో ప్రొడ్యూసర్స్:  సి.వి.రావ్, పత్సా నాగరాజు

కథ: పరుచూరి మురళి

మ్యూజిక్: చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్

ఆర్ట్: చిన్నా

పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు

కొరియోగ్రఫీ: జానీ మాస్టర్

Balayya Ruler Movie Latest Update:

Balakrishna And Vedhika Shoot Melody Song For Ruler In Munnar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs