Advertisement
Google Ads BL

అయోధ్య తీర్పుపై యాంకర్ రష్మి రియాక్షన్ ఇదీ..


భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అయోధ్య భూవివాదంపై నేడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలం హిందువులకు.. ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం అంటూ సుప్రీం తేల్చేసింది. అంతేకాదు దశాబ్దాలుగా నెలకొన్న ఈ వివాదానికి శనివారం నాడు 10:30 వాదనలు మొదలై 11:30 గంటలకు తీర్పువచ్చేసింది. అంటే ఇన్ని రోజులుగా నెలకొన్న ఈ వివాదానికి కేవలం ఒకే ఒక్క గంటలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చేసింది. ఈ తీర్పుపై కొందరు ముస్లిం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు హిందువులు ఎట్టకేలకు తామే గెలిచామని పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగ వాతావరణం ఒక్క అయోధ్య, ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగా నెలకొంది.

Advertisement
CJ Advs

అయితే ఈ తీర్పుపై ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించగా.. తాజాగా టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన రష్మి గౌతమ్ రియాక్ట్ అయ్యింది. వాస్తవానికి తనకు సంబంధించిన విషయాలతో పాటు.. సామాజిక అంశాల పట్ల రష్మి ఎక్కువగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండేవారిలో ఈ హాట్ యాంకర్ టాప్‌లో ఉంటుంది. సుప్రీం తీర్పుపై ఒకట్రెండు కాదు ఏకంగా ఐదారు ట్వీట్స్ చేసింది ఈ ముద్దుగమ్మ. మొదట ‘జై శ్రీరామ్’ అనే ట్వీట్‌తో మొదలుపెట్టిన.. ఈ ట్వీట్‌పై కామెంట్ చేసిన వారికి ఆమె కూడా రిప్లై ఇస్తూ మరిన్ని ట్వీట్స్ చేసింది.

‘అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును సమర్థించడం ద్వారా ముస్లింలదే తప్పని మీరనుకుంటున్నారా?’ అని నెటిజన్ ప్రశ్నించగా రష్మి చాలా లాజిక్‌గా బదులిచ్చింది. ‘ అబ్బే అదేం లేదే.. వారికి అయోధ్యలో మరో చోట భూమి ఇస్తున్నారు కదా.. ఇక్కడ మీ కొచ్చిన సమస్య ఏంటి? లేక, నాతో మరోసారి ట్వీట్ చేయిద్దామనా?’ అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. అంతేకాదు.. గతంలో తనను కూడా హిందూ వ్యతిరేకిగా ముద్రవేశారని.. దీపావళికి టపాసులు పేల్చడం వద్దన్నందుకు తనపై విమర్శలు గుప్పించారన్న రష్మి మరోసారి గుర్తు చేసింది.అయితే రష్మిపై కొందరు పంచ్‌ల వర్షం కూడా కురిపించారు. ఈ హాట్ బ్యూటీ ట్వీట్స్‌కు అభిమానులు మాత్రం మురిసిపోతూ కామెంట్స్, పెద్ద ఎత్తున షేర్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో రష్మి ట్వీట్స్ వైరల్.. చర్చనీయాంశంగా మారాయి.

Tollywood Anchor Reshmi reacts on Ayodhya verdict:

Tollywood Anchor Reshmi reacts on Ayodhya verdict  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs