Advertisement
Google Ads BL

‘సాహో’ ఎఫెక్ట్: ప్రభాస్‌లో అది మొదలైంది


సాహో సినిమాకి ఎడా పెడా ఖర్చు పెట్టేసారు. సినిమా హిట్ అయ్యి అనుకున్న కలెక్షన్స్ వస్తే ఎంత ఖర్చు పెట్టినా... అడిగేవారు, అనుకునే వారు ఉండరు. సాహోకి అనుకున్న బడ్జెట్ వేరు. అయ్యింది వేరు. దుబాయ్ లాంటి దేశంలో కోట్లకి కోట్లు పెట్టి యాక్షన్ సన్నివేశాలు తీశారు. మరి సినిమా పోయేసరికి ఆ ఖర్చు మొత్తం వేస్ట్ ఖర్చు జాబితాలోనే పడింది. అందుకే ప్రభాస్ తన తదుపరి చిత్రానికి బడ్జెట్ కంట్రోల్ పెట్టాడనే న్యూస్ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న జాన్ సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు.

Advertisement
CJ Advs

విదేశాలలో నడిచే 1965 కాలం నాటి లవ్ స్టోరీ కోసం దాదాపుగా 40 రకాల భారీ సెట్స్ వేస్తున్నారని గతంలో అన్నారు. యూరప్ బ్యాగ్రౌండ్‌లో తెరక్కించాల్సిన సినిమాని ఇప్పుడు యూరప్ లాంటి దేశం వెళితే భారీ ఖర్చు గనక రామోజీ ఫిలింసిటిలో ఓ విదేశీ సెట్ వేసి షూట్ చెయ్యాలని ప్రభాస్ నిర్మాతలకి, చిత్ర బృందానికి సూచించాడట. ఇక చిత్ర బృందం కూడా ప్రభాస్ చెప్పినదానికి ఓకే చెప్పి.... ఫిలింసిటీలో ఆ సెట్ ఏర్పాట్లలో తలమునకలయ్యారట. ఇక ఈ సినిమాకోసం వేయాల్సిన సెట్స్ లో ఎంతో ఇంపార్టెంట్ ఉంటేనే వెయ్యాలి.. లేదంటే వద్దని కూడా నిర్మాతలకు ప్రభాస్ చెప్పినట్టుగా టాక్. సాహో దెబ్బకి ప్రభాస్ కరెక్ట్ గా లైన్‌లోకొచ్చినట్టుగా కనబడుతుంది. 

Saaho Effect: Prabhas Caring on Jaan:

Prabhas Orders to Jaan Movie Team on Budget
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs