Advertisement
Google Ads BL

మీసం తిప్పుతాడనుకుంటే ఇలా అయిందేంటి?


‘నీది నాది ఒకటే కథ, బ్రోచేవారెవరురా’ సినిమాలతో హీరో ఇమేజ్ సంపాదించుకున్న శ్రీ విష్ణు సినిమా మార్కెట్‌లోకి వస్తుంది అంటే... మంచి అంచనాలు ఆ సినిమాపై పెరుగుతున్నాయి. అందులోను అంచనాలకు మించేలా వదులుతున్న ట్రైలర్స్‌తో సినిమాలపై ఆసక్తి కలిగినట్టుగానే శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘తిప్పరా మీసం’ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ముందునుండి ప్రమోషన్స్‌లో వీక్ అయినా... సినిమా విడుదలకు ముందు బాగా ప్రోమోట్ చేసి సినిమాని భారీ అంచనాల మధ్యన... శ్రీ విష్ణు క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు నిర్మాతలు. కృష్ణ విజయ్‌ దర్శకత్వంలో సింపుల్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన తిప్పరా మీసం సినిమాకి ప్రేక్షకులు ప్లాప్ టాక్ ఇచ్చారు. ఇక క్రిటిక్స్ కూడా శ్రీ విష్ణు సినిమాని ఆడుకున్నారు. కథ, కథనాల్లో వీక్ గా వున్న సినిమాని శ్రీ విష్ణు నటన గాని, మ్యూజిక్ గాని, క్లైమాక్స్ సన్నివేశాలు గాని నిలబెట్టలేకపోయాయి.

Advertisement
CJ Advs

కథ, కథనం వీక్‌గా ఉండడం, సాగదీత సన్నివేశాలు బోరు కొట్టించడం, ఎడిటింగ్‌లో లోపాలు, బలమైన ఎమోషన్స్ లేకపోవడంతో సినిమాకి ప్లాప్ టాక్ పడింది. సినిమా మొత్తం మదర్ సెంటిమెంట్‌తో నడిచింది. విష్ణు మదర్ కేరెక్టర్‌లో రోహిణి శక్తికి మించి నటించింది. చిన్నప్పుడే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొడుకుని డ్రగ్ అడిక్షన్ సెంటర్‌కి పంపిన తల్లిమీద కొడుకు పెంచుకున్న పగతోనే సినిమా మొత్తం నడుస్తుంది. ఇక స్టోరీ లైన్ చిన్నదయినా... స్క్రీన్‌ప్లే లో గ్రిప్ ఉంటే.. సినిమా హిట్టయ్యేది. కానీ దర్శకుడు స్క్రీన్‌ప్లేని బలంగా చూపించలేకపోయాడు. ఇక సినిమాకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ తప్ప మరేది లేదు. మరి రెండు మంచి హిట్స్‌తో ఉన్న శ్రీ విష్ణు తిప్పరామీసం అంటూ మాస్ ఎలిమెంట్స్‌తో వచ్చి మీసం తిప్పలేకపోయాడు.

Thipparaa Meesam Result at Box Office:

Thipparaa Meesam Movie Failed at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs