తెలుగులో ఢీ, రెడీ, బొమ్మరిల్లు లాంటి సినిమాలతో తనకంటూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హాసిని ఉరఫ్ జెనీలియా... బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది. అయితే కెరీర్ కాస్త స్లోగా ఉన్నప్పుడు పెళ్లిచేసుకున్న జెనీలియా... మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లుగా ఈమధ్యన అనిపిస్తుంది. పిల్లలు పుట్టాక అవార్డ్స్ ఫంక్షన్ ని కూడా అవాయిడ్ చేసిన జెనీలియా ప్రస్తుతం బాలీవుడ్ ఈవెంట్స్ కి తరచు వస్తూ ఆదిరిపోయే ఫిట్నెస్ తో అదరగొట్టే డ్రెస్సులతో నేను మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానని చెప్పకనే చెబుతుంది.
అయితే తాజాగా జెనీలియా పేరు మెగాస్టార్ చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్నట్లుగా ఫిలిం నగర్ టాక్. ఈ నెలలో మొదలవుతుంది అనుకున్నప్పటికీ.. చిరు - కొరటాల సినిమా డిసెంబర్ రెండో వారంగాని పట్టాలెక్కదని, ఈలోపు కొరటాల, చిరు సినిమా కోసం నటుల ఎంపిక కూడా పూర్తి చేస్తాడని అంటున్నారు. ఇక మెయిన్ హీరోయిన్ గా త్రిష అని, సెకండ్ హీరోయిన్ లిస్ట్ లో ఈషా రెబ్బ పేరు వినబడినా... ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం చూస్తున్న జెనీలియా పేరు పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ తో జెనీలియా ఆరెంజ్ చిత్రం చేసింది. ఆ పరిచయంతోనే జెనీలియా కోసం రామ్ చరణ్ సంప్రదింపులకు దిగుతున్నట్టుగా టాక్.