Advertisement
Google Ads BL

ఎట్టకేలకు యాంకర్ ప్రదీప్ క్లారిటీ..!


గత నెల రోజులుగా యాంకర్ ప్రదీప్ ఆరోగ్యంపై రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. అయితే ప్రదీప్ రెమ్యునరేషన్ పెంచడంతో.. ప్రదీప్ ని షోస్ నుండి తప్పించారని ప్రచారం జరిగింది. ఇక ప్రదీప్ కి ఏదో రాకూడని జబ్బు రావడంతోనే తాను చేసే షోస్ అన్నిటిని ప్రదీప్ వదిలేసాడని, అసలు ప్రదీప్ కి ఏమైంది అంటూ రకరకాల ప్రశ్నలతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ఇక అంత ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రదీప్ కనీసం మీడియాతో టచ్ లోకి రాకపోవడంతో.. ఈ ఉహాగానాలన్నీ నిజమయ్యేలా కనబడుతున్నవేళ ప్రదీప్ సడన్ గా సోషల్ మీడియా లైవ్ లోకొచ్చాడు.

Advertisement
CJ Advs

తాను కనబడకపోయేసరికి.. చాలామంది చాలా రాకాలుగా అనుకున్నారని, ఓ నెల నుండి కనబడకపోయేసరికి.. ప్రేక్షకులతో ఇంటెరెక్షన్ తగ్గిందని, అసలు తనకేమి అనారోగ్యం రాలేదని, కాకపోతే చిన్న యాక్సిడెంట్ అయ్యి.. కాలుకి ఫ్రాక్చర్ అయిందని.. షూటింగ్ చేస్తున్నపుడు దెబ్బ తగలడంతో డాక్టర్లు సర్జరీ చేసి నిల్చోవద్దని చెప్పినట్లు చెప్పాడు ప్రదీప్. మరి యాంకరింగ్ అంటే నిల్చుని చేసే పని గనక రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని, ఒకవేళ నిల్చుని యాంకరింగ్ చేస్తే ఆ కాలు తీసేస్తామని డాక్టర్స్ భయపెట్టారని, కాలు దిండు మీద పెట్టి పడుకోబెట్టారని, ఇక త్వరలోనే అంటే మరో వారం నుండి తాను తన షూటింగ్ లకు జాయిన్ అవుతానని చెప్పిన ప్రదీప్.. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలంటూ.. తన ఆరోగ్యం పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. 

Anchor Pradeep on his Health Condition:

Anchor Pradeep Live Video with Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs