Advertisement
Google Ads BL

‘ఎంత మంచివాడవురా’ ప్రొమోషన్స్‌లో మంచి ఏది?


సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల హడావిడి ఎప్పుడో మొదలైంది. బడా స్టార్స్ అల్లు అర్జున్, మహేష్ లైతే తమ తమ సినిమాల ప్రమోషన్స్ ని హోరెత్తిస్తున్నారు. ఒకరు పాటలతో హైప్ చేస్తుంటే మరొకరు స్టిల్స్, పోస్టర్స్ తో మైమరపిస్తున్నారు. సంక్రాంతి హడావిడి ఇప్పటినుండే కనబడుతుంటే... ఈ ఇద్దరు బడా స్టార్స్ మీదకి ఎంతో కాన్ఫిడెంట్ గా వస్తున్న మీడియం హీరో కళ్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలవ్వలేదు. చిన్న సినిమా, అందులోను స్టార్ హీరోలతో యవ్వారం, అలాంటప్పుడు ఎంత క్రేజ్‌తో సినిమాని ప్రమోట్ చెయ్యాలి. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ప్రస్తుతం చాలా సైలెంట్ గా ఉన్నాడు. జనవరి 15న విడుదల కాబోతున్న ఎంత మంచివాడవురా ఫస్ట్ లుక్, మెహరీన్ బర్త్ డే లుక్స్ తప్ప ఆ సినిమా అప్ డేట్ మరేది లేదు.

Advertisement
CJ Advs

అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో పాటలు మార్కెట్ ని షేక్ చేస్తూ.. సినిమాపై భారీ క్రేజ్ పెంచడమే కాదు... సినిమా బిజినెస్ పరంగా పరుగులు పెడుతుంది. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా వర్కింగ్ స్టిల్స్, పోస్టర్స్ తో హోరెత్తిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రమోషన్స్ ని బట్టే మార్కెట్ పెరుగుతుంది, బిజినెస్ కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. మరి ఎంత మంచివాడవురా కూడా ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తూ కాస్త వెరైటీ ప్రమోషన్స్ చేస్తేనే సినిమాపై హైప్ పెరిగి కళ్యాణ్ రామ్ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది. చూద్దాం కళ్యాణ్ రామ్ ఎప్పుడు మేల్కొంటాడో అనేది.

No Promotions to Kalyan Ram Entha Manchivadavuraa Movie:

Entha Manchivadavuraa Movie In Sankranthi 2020 Race
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs