Advertisement
Google Ads BL

నన్ను నొప్పించడంలో మీరు సక్సెస్..కంగ్రాట్స్: రష్మిక


సినీ ఇండస్ట్రీలో పుకార్లు, రూమర్స్ కామన్ అనే విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా హీరోయిన్లపై లేనిపోని పుకార్లు రావడం.. ఎక్కడలేని వార్తలు వస్తుండటం షరామామూలే. అయితే ఇలా రూమర్స్ వచ్చినప్పుడు కొందరు స్పందించి క్లారిటీ ఇచ్చుకుంటారు.. మరికొందరేమో ఎవరేమనుకుంటే మనకేంటి.. మనం సక్రమంగా ఉన్నాం ఇక అవన్నీ మనకెందుకు అని మిన్నకుండిపోతుంటారు. అయితే తాజాగా.. తనపై వస్తున్న రూమర్స్‌కు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి ఊపు మీదున్న రష్మిక మందన్నా క్లారిటీ ఇచ్చుకుంది.

Advertisement
CJ Advs

‘గీతాగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాల్లో విజయదేవరకొండతో కలిసి రష్మిక నటించింది. వీరిద్దర్ని అప్పట్లో సూపర్ జోడి అని వర్ణించారు కూడా.! అయితే ఎప్పుడైతే గీతగోవిందం సూపర్ డూపర్ హిట్టయ్యిందో అప్పట్నుంచి ఈ భామకు ఇక అవకాశాలు బోలెడెన్ని వస్తున్నాయి. అంతేకాదు.. అవకాశాలతో పాటు.. రూమర్స్‌ కూడా గట్టిగానే పుట్టుకొస్తున్నాయ్. విజయ్‌కు.. రష్మికకు మధ్య ఎఫైర్ ఉందని అటు సోషల్ మీడియా.. ఇటు కొన్ని వెబ్‌సైట్లు పనిగట్టుకుని కథనాలు రాశాయి. అయితే తాజాగా కొందరు ‘ఈ చిన్న పిల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో.......... అవుతుందని ఎవరైనా ఊహించారా’ అని రష్మికపై ఓ పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ విషయం ఆ చెవిన ఈ చెవిన పడి రష్మిక దాకా వెళ్లడంతో ఈ వ్యవహారంపై స్పందించింది.

‘నటీనటుల మీద ఇటువంటి విమర్శలు చేస్తే ఏమొస్తుందో తెలియడం లేదు. యాక్టర్స్ అంటే సాఫ్ట్ టార్గెట్ అవుతారన్న ఉద్దేశంలో వీరున్నారు.. నేను పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన నన్ను డైరెక్ట్‌గా టార్గెట్ చెయ్యొచ్చని కాదు. నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోవద్దని నాకు చాలా మంది చెబుతుంటారు. అయితే వాటిలో కొన్నింటిని మాత్రం పట్టించుకోవాల్సి వస్తోంది’ అని ఈ బ్యూటీ కాసింత అసహనం.. అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతటితో ఆగని రష్మిక..  తనపై ఈ పోస్ట్‌ను పెట్టిన వాళ్లకు కంగ్రాట్స్‌ చెప్పింది. అంతేకాదు.. తనను నొప్పించాలనుకున్న వారు విజయవంతం అయ్యారని ఒకింత సెటైర్ వేసింది. మరి ఇకనైన ఈ ముద్దుగుమ్మపై పుకార్లు ఆగుతాయో లేదో మరి.

Rashmika Mandanna Reacted on Social Media Gossips:

Rashmika Mandanna punch on Netizen
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs