Advertisement
Google Ads BL

అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ హీరోయిన్‌ ఎవరంటే..!


ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబ‌ర్ 10న పలువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో గ్రాండ్‌గా లాంచ్‌కానుంది. రీసెంట్‌గా ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన నిధి అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది.

Advertisement
CJ Advs

అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

 

న‌టీన‌టులు:

అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్‌, న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య త‌దిత‌రులు

 

సాంకేతిక నిపుణులు:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఆదిత్య‌.టి

నిర్మాత‌: ప‌ద్మావ‌తి గ‌ల్లా

బ్యాన‌ర్‌: అమ‌ర్ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి

మ్యూజిక్‌: జిబ్రాన్‌

సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌

ఆర్ట్‌: రామాంజ‌నేయులు

ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి

డైలాగ్స్‌: క‌ల్యాణ్ శంక‌ర్‌, ఎ.ఆర్‌.ఠాగూర్‌

కాస్ట్యూమ్స్‌: అక్ష‌య్ త్యాగి, రాజేష్‌

పి.ఆర్‌.ఓ: బి.ఎ.రాజు, వంశీ శేఖ‌ర్‌

Heroine Fixed for Ashok Galla Debut Movie:

Nidhhi Agerwal in Ashok Galla’s Debut, Grand Launch on November 10th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs