Advertisement
Google Ads BL

అను ఇమ్మానుయేల్ ఇప్పుడు ఫీలైతే ఏం లాభం?


వరసగా మెగా హీరోలతో సినిమాలు చేసి.. గ్లామరస్ గా అలరించినా క్రేజ్ సంపాదించలేక కనుమరుగైన హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కి అస్సలు ఆఫర్స్ లేవు. నాని, రాజ్ తరుణ్ లాంటి యూత్ హీరోలతో నటించినా అనుకి అస్సలు క్రేజ్ సంపాదించలేకపోయింది. అను ఇమ్మానుయేల్ కి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో నటించినా అమ్మడు ఫేట్ మాత్రం మారలేదు. గ్లామర్ షో చేసినా అమ్మడుకి అవకాశాలు కరువయ్యాయి. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య భారీ డిజాస్టర్స్ తో అను ఇమ్మానుయేల్ సోదిలోకి లేకుండా పోయింది. అప్పుడప్పుడు అవార్డ్స్ ఫంక్షన్స్ లో మెరిసే అను.. అసలు ఈమధ్యన కనబడడమే మానేసింది.

Advertisement
CJ Advs

మళ్ళీ ఇన్నాళ్ళకి వార్తల్లోకి వచ్చిన అను ఇమ్మానుయేల్ గ్లామర్ షో చేసి దెబ్బతిన్నా అంటుంది. కథల విషయంలో చేసిన పొరబాటు వలన తన కెరీర్ దెబ్బతిందని వాపోతుంది. అందమున్నా.. గ్లామర్ షో చేసినా... లక్ లేకపోవడం అనుని దెబ్బకొట్టింది. అయితే కేవలం కథల విషయంలో దృష్టి పెట్టనందుకే తనకు ఈ గతి పట్టిందని సన్నిహితులకు చెప్పి తెగ ఫీల్ అవుతుందట అను ఇమ్మానుయేల్. ప్రస్తుతం అవకాశాలు లేని ఆమెకి ఏదో ఒకటి తగిలి మళ్ళీ ఫామ్ లోకి రాకపోతానా అని నమ్మకంతో టాలీవుడ్ పై ప్రత్యేక దృష్టిపెట్టినట్లుగా టాక్. అందుకే సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుని హాటెస్ట్, గ్లామర్ ఫోటో షూట్స్ కి తెర లేపాలనే ఆలోచన చేస్తుందట అను.

Anu Emmanuel Feels with her Exposing:

Anu Emmanuel about Movie Chances
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs