గత శుక్రవారం విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మీకు మాత్రమే చెప్తా, ఆవిరి సినిమాలను ప్రేక్షకులు రిజెక్ట్ చెయ్యడంతో.... అంతకుముందు విడుదలైన కార్తీ ఖైదీ సినిమా మళ్ళీ ఓ ఊపు ఊపింది. కార్తీ ఖైదీ ఈ గురువారం వరకు కూడా మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక రేపు శుక్రవారం కూడా టాలీవుడ్ నుండి చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి అందులో శ్రీ విష్ణు తిప్పరా మీసం సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే బ్రోచేవారెవరురా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన శ్రీ విష్ణు సినిమా కావడంతో.. తిప్పరా మీసంపై క్రేజ్ ఏర్పడింది.
తిప్పారు మీసం ట్రైలర్ కూడా బావుండడంతో.. సినిమాపై అంచనాలు పెరగడం, ప్రేక్షకుల్లో ఆసక్తి రావడం జరిగింది. ఇక ఈ వారం శ్రీ విష్ణుకి ఎదురు నిలిచే సాహసం ఎవరు చెయ్యలేదో? లేదంటే ఎవరూ ఈ నవంబర్ 8 ని కావాలనే వదులుకున్నారో తెలియదు కానీ... తిప్పరా మీసం సినిమా మాత్రం సోలో గానే బరిలోకి దిగుతుంది. కాకపోతే ఈరోజు నవంబర్ 7 న 7 చేపల కథ విడుదలైనా అది సోదిలోకి లేకుండా పోవడంతో.... శ్రీ విష్ణు తిప్పరా మీసం సినిమాతో నిజంగానే మీసం తిప్పేస్తున్నాడు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ పడినా.. శ్రీ విష్ణు మరో హిట్ అందుకోవడం ఖాయం.