ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 3 ముగిసిపోయింది. కానీ బిగ్ బాస్ పై వచ్చే న్యూస్ లతో ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ జరుగుతున్నంత సేపు శ్రీముఖి, బిగ్ బాస్ యాజమాన్యం కుమ్మక్కై ఆమెకి సపోర్ట్ చేసారని అంటే... ట్రోఫీని రాహుల్ కైవశం చేసుకున్నాక రాహుల్ - పునర్నవి పెళ్లి ముచ్చట్లు మొదలయ్యాయి. అయితే తాజాగా శ్రీముఖి విషయంలో బిగ్ బాస్ అడ్డంగా బుక్కయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టుగా శ్రీముఖి లాంటి క్రేజీ యాంకర్ ని తీసుకున్నందుకు గాను బిగ్ బాస్ యాజమాన్యం ఆమెకి ఉన్న క్రేజ్ తో లెక్కలు కట్టి రోజుకి 1 లక్ష రూపాయల డీల్ చేసుకున్నారని. అలాగే తన విషయంలో ఎలాంటి నెగిటివిటి ఉండకూడదని వారితో అగ్రిమెంట్ చేసుకోవడం వలనే శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లో చేసిన వెధవ పనులేమీ బయటికి రాలేదని అంటున్నారు.
మరి శ్రీముఖి రోజుకి లక్ష తీసుకుంటే.. 15 వారాలకి కలిపి కోటి అందుకున్నట్టే. మరి ఆమె బిజీ కావడంతో బిగ్ బాస్ కూడా ఆమె పారితోషకాన్ని లెక్క చెయ్యలేదని టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి న్యూస్ బయటికి వస్తే.. నెక్స్ట్ సీజన్ కోసం కాస్త క్రేజ్ ఉన్న సెలెబ్రిటీని తీసుకుంటే.... వారికీ రోజుకెంత ఇవ్వాల్సి వస్తుందో అని... అసలు బిగ్ బాస్ విషయాలేమి బయటికి రాకుండా జాగ్రత్త తీసుకుంటుంటే.... ఇలాంటివి ఎలా పొక్కుతున్నాయని బిగ్ బాస్ యాజమాన్యం టెంక్షన్ లో ఉందట. మరి బిగ్ బాస్ పై క్రేజ్ రావాలంటే కచ్చితంగా సెలెబ్రిటీ రావాలి. మరి ఆ సెలెబ్రిటీ కోసం ఎంత ఖర్చు చెయ్యాల్సి వస్తుందో అంటూ ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం కంగారు పడుతుందట.