Advertisement
Google Ads BL

‘మైత్రీ’కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..!?


తెలుగు చిత్రసీమ‌లో పెద్ద నిర్మాణ సంస్థల్లో ‘మైత్రీ’ మూవీ మేక‌ర్స్ ఒక‌టన్న విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ సినిమాలతో పాటు పలు బ్లాక్ బస్టర్లతో అందరి చూపుని తమవైపు తిప్పుకుంది ‘మైత్రీ’ మూవీ మేకర్స్. ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈ సంస్థ.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తహతహలాడుతోంది.!. మైత్రీ అంటే ఎవరు కాదనరు.. వెనకడుగు వేయరు.. మారుమాట ఆలోచించరు.. అదీ ఆ సంస్థ రేంజ్. అసలు చిరంజీవితోనే సినిమా ఎందుకు చేయాలనుకుంటోంది..? అసలు కథేంటో ఈ కథనంలో చూద్దాం.

Advertisement
CJ Advs

రాజకీయాల్లో ఆశించినంతగా రాణించలేకపోయిన అనంతరం బ్యాక్ టూ మూవీస్ అంటూ వచ్చిన మెగాస్టార్ ఇప్పటికే ‘ఖైదీ నంబ‌ర్ 150’, ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్నాడు. ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న మెగాస్టార్.. కొరటాల శివ సినిమాతో ఆ కోరిక తీర్చుకోనున్నాడు!. అయితే ఇప్పటి వరకూ చిరుతో సినిమా చేయని మైత్రీ మూవీమేకర్స్ .. తన తదుపరి చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యిందట. ఇందుకు సుకుమార్‌ను డైరెక్టర్‌గా ఎంచుకుందట. ప్రస్తుతం అటు చిరు.. ఇటు సుక్కు ఇద్దరూ సినిమాలతో బిజీబిజీగా ఉండటంతో పూర్తవ్వగానే.. సుక్కు-చిరు కాంబోలో చిత్రం తీయాలని సదరు సంస్థ భావిస్తోందని సమాచారం.

వాస్తవానికి స్టా్ర్ హీరోతో సినిమా చేయాలని మైత్రీ మేకర్స్ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తుండగా సరిగ్గా.. చిరు గుర్తొచ్చారు. అంతేకాదు.. చిరు కూడా మైత్రీ పనితనాన్ని మెచ్చుకున్నారు. అదెలాగంటే.. రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చేస్తున్న సమయంలోనే చిరుతో స్నేహం ఏర్పడింది. దీంతో చెర్రీ సపోర్ట్ తీసుకుని ఓ మంచి కథతో చిరు దగ్గరికి త్వరలో వెళ్లాలని భావిస్తోందట. ఈ రూట్‌లో వెళితే పెద్దగా ఆటంకాలేమీ ఉండవని భావించి ప్రయత్నాలు సాగిస్తోందట ఆ సంస్థ. మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘అల వైకుంఠపురంలో..’ నిర్మిస్తోంది. ఇది పూర్తై రిలీజ్ అవ్వగానే చిరుతో జతకట్టాలని మైత్రీ భావిస్తోందట. మరి ఆ కథ సుక్కుతోనేనా..? మరెవరైనా డైరెక్టర్ ఉంటాడా..? అసలు చిరు ఒప్పుకుంటాడా..? ఒప్పుకోడా..? అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే మరి.

Will Megastar Chiru Gives Green Signal To Mythri movie makers!:

Will Megastar Chiru Gives Green Signal To Mythri movie makers!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs