నా అభిమాన నటుడు ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది - డైరెక్టర్ సురేందర్ రెడ్డి
సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో వాళ్ళబ్బాయి నటరాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ లవర్స్ డే ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో సుఖీభవ మూవీస్ బ్యానర్లో తెరకెక్కిస్తున్న ‘ఊల్లాల ఊల్లాల’ టీజర్ ని ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా ఇష్టమైన వ్యక్తి , ఆర్టిస్టు సత్యప్రకాష్ గారు నేను 10 ఏళ్ల క్రితం కలిసి పని చేసాము. కలిసి పనిచేసింది రెండు మూడు సినిమాలైనా ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా, నవ్వుతూ పలకరిస్తారు. అందుకే నాకు ఆయనంటే అభిమానం. అందుకోసమే ఆయన అడిగిన వెంటనే రావడానికి ఒప్పేసుకున్నా. ఒకవైపు డైరెక్షన్ చేస్తూ మరోవైపు అబ్బాయిని పరిచయం చేయడం చాలా గొప్ప విషయం. ఇక్కడి నుండి మొదలై వారి అబ్బాయికి మంచి సినిమాలు రావాలని ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ ఎ.గురురాజ్ గారు ఈ చిత్రం తరువాత పెద్ద పెద్ద చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నిషన్స్ అండ్ టీం అందరికి ఆల్ ది బెస్ట్, ముఖ్యంగా సంగీత దర్శకుడు జాయ్ కొత్తవాడైనా మంచి సంగీతాన్ని అందించారు, అతనికి మరిన్ని అవకాశాలు రావాలని ఆశిస్తున్నా’’ అన్నారు.
ప్రొడ్యూసర్ ఎ.గురురాజ్ మాట్లాడుతూ.. ‘‘సైరా నరసింహారెడ్డిలో అద్భుతంగా నటించిన చిరంజీవి గారిని ఘనంగా సత్కరించుకున్నాము. ఇప్పుడు ఆ అద్భుత చిత్రాన్ని తీసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా ‘ఊల్లాల ఊల్లాల’ టీజర్ రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది. మా బ్యానర్లో నాలుగవ చిత్రంగా వస్తున్న ‘ఊల్లాల ఊల్లాల’ తో సత్యప్రకాష్ గారిని దర్శకుడిగా పరిచయం చేయడం వారి అబ్బాయి నటరాజ్ ని హీరోగా తెలుగు ప్రజలకి పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే సత్యప్రకాష్ గారి మీదున్న నమ్మకంతో, నా మీదున్న అభిమానంతో ఈ చిత్రంలో చేయడానికి ఒప్పుకున్న నటీనటులు లవర్స్ డే ఫేమ్ నూరిన్, మిస్ బెంగుళూరు అంకిత, బాహుబలి ప్రభాకర్ గారు, ముంగిలి గారు, రోల్ రైడ, రఘు బాబు, పృథ్వీ, అదుర్స్ రఘు అందరికి నా ధన్యవాదాలు. అందరు వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. అలాగే చిన్నవాడు కొత్తవాడు అయినప్పటికీ ఈ చిత్రానికి జాయ్ సంగీతం మరియు ఆర్.ఆర్ చాలా బాగా ఇచ్చాడు. ఉర్రుతలూగించేలా ఉండే ఈ పాటలు త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. 600 వాహనాలతో చేయాల్సిన ఒక పాట చిత్రీకరణపై మేము సందిగ్ధంలో ఉండగా, శేఖర్ మాస్టర్ గారు సినిమా బాగా రావాలి వస్తే చాలు అంటూ మమ్మల్ని ఒప్పించి దాన్ని అద్భుతంగా చిత్రీకరించడమే కాక, మిగితా పాటలకి కూడా పూర్తి న్యాయం చేశారు. ఈ పాటలలో కాసర్ల శ్యామ్ గారు గురు చరణ్ గారు రాసిన పాటలు అందరికీ చాలా నచ్చుతాయి. అదే విధంగా కన్నడలో బాగా పేరు పేరుపొందిన జె.జె కృష్ణ గారు మా చిత్రానికి ఛాయాగ్రహణం చేశారు. చివరగా, ఈ రోజు మేము విడుదల చేసిన టీజర్ ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ త్వరలో పాటలని మరియు ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.
దర్శకుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ.. ‘‘నేనెంతగానో ఇష్టపడే వ్యక్తి , అభిమానించే దర్శకుడు సురేందర్ రెడ్డి గారు మా ఈ టీజర్ లాంచ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ‘ఊల్లాల ఊల్లాల సూపర్ డూపర్ హిట్’ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవుతుందని నమ్ముతూ, అందుకు మీరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
సంగీత దర్శకుడు జాయ్ మాట్లాడుతూ - ‘‘ముందుగా మాకోసం సమయం కేటాయించి మా ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సత్య ప్రకాష్ గారు, ప్రొడ్యూసర్ గురురాజ్ గారి ప్రోత్సాహంతో ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రంలో 4 పాటలకు సంగీతాన్ని అందించాను. హీరో నటరాజ్, హీరోయిన్స్ మరియు టెక్నీషియన్ లు అందరూ నాకు చాలా మంచి తోడ్పాటుని అందించారు, అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు.
హీరో నటరాజ్ మాట్లాడుతూ.. ‘‘మొదటగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు వారి తీరిక లేనన్ని పనుల్లో కూడా మాకోసం సమయమివ్వడం చాలా ఆనందంగా ఉంది. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న ప్రొడ్యూసర్ గురురాజ్ గారికి అలాగే డైరెక్టర్ గారు- మా నాన్నగారు సత్యప్రకాష్ గారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా హీరోయిన్లు మిస్ బెంగుళూరు అంకిత మరియు మిస్ కేరళ నూరిన్ నటనలో ఊహించినదానికి రెండింతలు చేశారు. అలాగే సంగీత దర్శకుడు జాయ్ అందించిన పాటలకి డాన్స్ మాస్టర్ శేఖర్ గారు ఎప్పటిలాగే అదిరిపోయే స్టెప్పులు అందించారు. ముఖ్యంగా మా సినిమాటోగ్రాఫర్ మరియు ఇతర టెక్నీషియన్ లు మా ఈ ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రానికి అద్భుతంగా పనిచేశారు, అందుకు వారందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు.
తారాగణం:
నటరాజ్, నూరిన్, అంకిత, గురురాజ్, సత్యప్రకాష్, ‘బాహుబలి’ ప్రభాకర్, పృథ్వీరాజ్, ‘అదుర్స్’ రఘు, జబర్ధస్త్ నవీన్, లోబో, మధు, జబర్ధస్త్ అప్పారావు, రాజమౌళి, జ్యోతి, గీతాసింగ్, జయవాణి తదితరులు
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ
ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ, దీపక్
సంగీతం: జాయ్
ఎడిటింగ్: ఉద్ధవ్
నృత్య దర్శకత్వం: శేఖర్ మాస్టర్, దిలీప్ కుమార్
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్
ఆర్ట్: కె.మురళీధర్
పాటలు: కాసర్ల శ్యామ్, గురుచరణ్
కథ - స్క్రీన్ ప్లే-మాటలు-
నిర్మాత: ఎ.గురురాజ్
దర్శకత్వం: సత్యప్రకాష్.