Advertisement
Google Ads BL

చిరు రోల్‌పై ఆసక్తికర కథనాలు..!


కొరటాల అంటే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అనేలా ఆయన సినిమాలుంటాయి. ఆయన తీసినవి నాలుగు సినిమాలే అయినా.. అందులో కొరటాల సోషల్ మెసేజ్ మార్క్ స్పష్టంగా కనబడుతుంది. తాజాగా కొరటాల శివ.. చిరంజీవితో సినిమా మొదలు పెట్టాడు. ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కనున్న ఈ సినిమాకూడా ఓ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ అని చెబుతున్నారు. అయితే గతంలో వార్తలొచ్చినట్టుగా రైతు సమస్యలతో లింక్ అయిన సబ్జెక్టు తోనే కొరటాల - చిరు కాంబో సినిమా ఉండబోతుంది. ఇక చిరు ఈ సినిమాలో రెండు రకాల షేడ్స్ తో కనబడతాడని కూడా ప్రచారంలో ఉన్న న్యూస్.

Advertisement
CJ Advs

మధ్య వయస్కుడిగా ఉన్న చిరంజీవి మాజీ నక్సలైట్ గా కనిపిస్తాడని.... మాజీ నక్సలైట్ గా చిరు దేవాదాయ భూములను అన్యాక్రాంతం అవకుండా ఆ సమస్యపై పోరాడే వ్యక్తిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. దేవాలయాల భూములను ఆక్రమించేసుకుని.. చివరికి దేవుడికి ప్రసాదం కూడా పెట్టలేని స్థితిలో ఉన్న పూజారులను, ఆ ఊరి జనాలని చూసిన చిరు పాత్ర ఆ సమస్యపై పోరాడతాడని అంటున్నారు. మరి చిరంజీకి మాజీ నక్సలైట్ గా ఎలా ఉండబోతున్నాడో... అంటూ మెగా ఫాన్స్ అప్పుడే ఊహల్లోకి దిగిపోయారు. ఇక కొరటాల ఎప్పటిలాగే చిరుని కాస్త క్లాస్ గానే మాస్ టచ్ లో చూపించబోతున్నట్లుగా టాక్ ఉంది. ఇక చిరు సరసన హీరోయిన్ గా ఇంకా ఎవరిని ఫైనల్ చెయ్యలేదు కానీ.. త్రిష నే ఫైనల్ అంటున్నారు.

Interesting News on Chiranjeevi Role in Koratala Film:

One More Gossip on Chiranjeevi and Koratala Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs