Advertisement
Google Ads BL

రాహుల్ ప్రైజ్ మనీ 50 లక్షలు కాదా..!


బిగ్ బాస్ సీజన్ 3 ముగిసి మూడు రోజులైంది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 3 పై వార్తలకు చెక్ పెట్టలేదు. సోషల్ మీడియాలోనూ, టివి ఛానల్స్ లోను బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో ఇంటర్వ్యూ ల కోసం పోటీ పడుతున్నారు. మెగాస్టార్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీ, 50 లక్షల చెక్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ కెరీర్ లో ఎంత బిజీ అవుతాడో తెలియదు కానీ.... ప్రస్తుతం టివి షోస్ తో తెగ హైలెట్ అవుతున్నాడు. మరోపక్క శ్రీముఖి ఫ్యాన్స్ ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అనుకుంటే.. షాకిస్తూ రాహుల్ విన్నర్ అయ్యేసరికి వారు ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.

Advertisement
CJ Advs

ఇకపోతే తనకి 50 లక్షలు వస్తే గనక ఓ సెలూన్ ఓపెన్ చేసుకుని, తన తల్లితండ్రులకు ఇల్లు కట్టించి వారి రుణం తీర్చుకుంటా అన్న రాహుల్ కి బిగ్ బాస్ యాజమాన్యం పెద్ద షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజి మీద రాహుల్ కి 50 లక్షలు ఇచ్చేసినట్టుగా చూపించారు. అబ్బా 50 లక్షలు అందుకున్న రాహుల్ అంటూ అందరూ మురిసిపోయారు కూడా. అయితే రాహుల్ ఆ 50 లక్షల ప్రైజ్ మని అందుకోలేదనే న్యూస్ రాహుల్ అభిమానులు నిరాశకి గురిచేస్తుంది. ఎందుకంటే... రాహుల్ కి ఇవ్వాల్సిన 50 లక్షల ఒప్పందం ప్రకారం 50 లక్షలు ఇచ్చినప్పటికీ.. అందులో కటింగ్స్(ఇన్ కమ్ టాక్స్ నిబంధనల ప్రకారం) పోను కేవలం 35 లక్షలు మాత్రమే రాహుల్ చేతికి వచ్చినట్లుగా టాక్. మరి 50 లక్షలు అనుకుంటే ఇలా 35 లక్షలతో రాహుల్ సరిపెట్టుకోవాల్సి రావడం పాపం అనిపిస్తుంది కదూ.

Rahul fans Disappoints with Bigg Boss Prize Money:

Bigg Boss Prize Money Only 35 lakhs 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs