Advertisement
Google Ads BL

ఆ స్టార్ హీరోలతో సినిమాలు చేయట్లే: మురుగదాస్


సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్‌ హంగులు జోడించి చెప్పటంలో మురగదాస్‌ దిట్ట అనే విషయం తెలిసిందే. టాలీవుడ్‌ ఈయనకు పెద్దగా అచ్చి రాలేదు కానీ.. కోలీవుడ్‌లో మాత్రం ‘నాకెవ్వరూ అడ్డులేరు.. నాకు నేనే పోటీ’ అన్నట్లుగా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే పలు డిఫరెంట్ కథలతో అభిమానులు, సినీ ప్రియుల ముందుకొచ్చిన మురగ.. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కథానాయకుడిగా ‘దర్బార్‌’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సినిమా దాదాపు ఫైనల్‌ స్టేజ్‌లో ఉండగా.. 2020 సంక్రాతి కానుకగా ‘దర్బార్‌’ ను పట్టుకొస్తున్నాడు మురగదాస్. అయితే ‘దర్బార్’ తర్వాత మురగ ఎవరితో సినిమా చేస్తున్నారు..? మళ్లీ లాంగ్ గ్యాప్ తీసుకుంటారా..? ఇదే ఊపుతో సినిమాలు చేసుకుంటూ పోతారా..? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.

Advertisement
CJ Advs

ఈ క్రమంలో కోలీవుడ్‌లో స్టార్ హీరోలు సూర్య, అజిత్‌లతో మురగదాస్ తదుపరి ప్రాజెక్టులు చేయబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయ్. అంతేకాదు.. ఇటీవల సూర్యకు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని కూడా పుకార్లు వచ్చాయి. మరోవైపు అజిత్‌కు కథ వినిపించగా ఆయన కూడా ఓకే అనేశారని.. దీంతో సూర్యతో చేయాల్సిన సినిమాకు గ్యాప్ ఇచ్చేసి మొదట అజిత్‌తో చేయాలని మురగదాస్ భావించారని వార్తలు గుప్పుమంటున్నాయ్. ఇటు సోషల్ మీడియాలో.. అటు మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వస్తుండటంతో ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మురగదాస్ స్పందించి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

‘సూర్య, అజిత్‌లతో సినిమా చేసే విషయం ఖరారు కాలేదు. రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘దర్బార్’ చిత్రం నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉన్నాను. నేను ఆ ఇద్దరికీ కథ వినిపించినట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లే.. అందులో ఎలాంటి వాస్తవాల్లేవ్. నేను ప్రస్తుతం బిజిబిజీగా ఉండటంతో సూర్య, అజిత్‌లను కలవలేదు’ అని మురగదాస్ కొట్టిపారేశారు. అంటే కథ వినిపించలేదు అన్నారు అంతే కానీ.. తదుపరి ప్రాజెక్ట్‌లు వాళ్లిద్దరితో ఉండవ్ అని మాత్రం చెప్పలేదు. సో.. మరో రెండు కథలు రెడీగానే ఉన్నాయన్న మాట. మరి మున్ముంథు ఈ ఇద్దరు స్టార్లతో సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

Murugadas Gives Clarity over Direct With Two Star Heros!:

Murugadas Gives Clarity over Direct With Two Star Heros!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs