Advertisement
Google Ads BL

మహేష్ ఖరాఖండిగా చెప్పేస్తున్నాడట!


మహేష్ బాబుతో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు క్యూ కడతారు. మహేష్ బాబు ఎప్పుడు ఫ్రీ అవుతాడు, డేట్స్ ఎప్పుడిస్తాడో అంటూ ఎదురు చూసే నిర్మాతలు బోలెడంత మంది ఉంటారు. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలే కానీ... కోట్ల బడ్జెట్ తో రెడీ అయ్యేవారు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ మహేష్ మాత్రం ఎప్పుడూ బడా నిర్మాతలతో సినిమాలు తీస్తూ సేఫ్ గేమ్ ఆడతాడు. యావరేజ్ పడినా.. మహేష్ క్రేజ్‌కి గాని, మార్కెట్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. అందుకే మహేష్‌తో సినిమాలంటే ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే బడా నిర్మాతలతో పనిచేసే మహేష్ పారితోషకం విషయంలో చాలా పక్కాగా ఉంటాడట.

Advertisement
CJ Advs

ఎందుకంటే గతంలో తండ్రి కృష్ణ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న టైంలో కొంతమంది నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసి పారితోషకం ఎగ్గొట్టడంతో.. ఇప్పుడు మహేష్ తన రెమ్యునరేషన్ విషయంలో గట్టిగా ఉంటున్నాడు. అందుకే నిర్మాతలకు కొన్ని కండిషన్స్ కూడా అప్లై చేస్తుంటాడట మహేష్. నేను ఇలానే ఉంటాను, కావాలంటే సినిమాలు చేయండి లేదంటే లేదు అని మహేష్ ఖరాఖండిగా చెప్పేస్తున్నాడట. తాజాగా పారితోషకం విషయంలో మహేష్ మైండ్ సెట్ మారింది. సినిమాల బడ్జెట్‌లో వాటా వెయ్యడు కానీ... లాభాల్లో వాటా మాత్రం కావాలంటున్నాడు. మరి మహేష్ తెలివితేటలకు కొంతమంది నిర్మాతలు షాకయినా.. మరికొంతమంది ఆయనతో సినిమా చెయ్యడానికి మాత్రం ముందుకొస్తున్నారట.

Mahesh Babu Decision on Remuneration:

Mahesh Babu Safe game on Movie Selection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs