Advertisement
Google Ads BL

‘మీకు మాత్రమే చెప్తా’.. పెద్ద విజయం!!


చిన్న సినిమా...పెద్ద విజయం..!! (3 రోజుల్లోనే 4.05 కోట్ల గ్రాస్ సాధించిన మీకు మాత్రమే చెప్తా.)

Advertisement
CJ Advs

హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ నెల 1న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్

ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచుతోంది. అంచనాలకు తగ్గట్టుగానే డీసెంట్ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే 4 కోట్ల 05 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది.

కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే తన అభిరుచి మేరకు విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ కు డబుల్ ట్రీట్ గా మారింది. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడమే అందుకు నిదర్శనం. ఇక హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ తో పాటు ప్రధాన పాత్రధారులైన అభినవ్ గోమటం, అవంతికా మిశ్రా, పావని గంగిరెడ్డి, అనసూయ, నవీన్ జార్జ్ థామస్ ల నటన, టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారడంతో రాబోయే రోజుల్లో మరింత పెద్ద విజయంగా ఈ సినిమా నిలవబోతోందని చెప్పొచ్చు.

సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా

సంగీతం : శివకుమార్

ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్

కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ

పిఆర్.వో : జి.ఎస్.కె మీడియా

లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతినేని

నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ

రచన- దర్శకత్వం : షామీర్ సుల్తాన్.

Meeku Maathrame Cheptha Movie Collections:

Meeku Maathrame Cheptha Collected 4.05CR in 3 Days
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs