Advertisement
Google Ads BL

అల్లు అర్జున్, మహేష్‌ల మధ్య రహస్య మీటింగ్?


ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే.... ఆ ఇద్దరి అభిమానుల మధ్యన మాటలే యుద్ధమే కాదు... చేతల యుద్ధంతో పాటుగా.. రెండు సినిమాల నిర్మాతలకు తుప్పు వదులుతుంది. హిట్ టాక్ పడితేనే నిర్మాతలు సేఫ్ అవుతారు కానీ... యావరేజ్ టాక్ పడినా.. ఇద్దరూ హీరోలు హేమ హేమీలు గనక నిర్మాతలకు లాసే వస్తుంది. అయితే దసరా, సంక్రాంతిలకు స్టార్స్ హీరోస్ పోటీ పడడం మాములే. కానీ బడా నిర్మాతలకు చివరికి మిగిలేదేం ఉండడం లేదు. అందుకే ఈ మధ్యన నిర్మాతలు కాస్త కాంప్రమైజ్ అయ్యి... డేట్స్ విషయంలో సర్దుబాట్లు చేసుకుంటున్నారు. అయితే సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ లు ఇద్దరు నువ్వా నేనా అంటూ ఒకే డేట్ కి బరిలోకి వస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే నిర్మాతల సంగతెలా ఉన్నప్పటికీ.. హీరోలిద్దరికి డేట్ విషయంలో పిచ్చ టెన్షన్ ఉంది. ఎంతగా ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ తో సినిమాలు చేసినా.... కలెక్షన్స్ విషయంలో తేడా కొట్టే అవకాశం ఉంది. జనవరి 12 నే మా సినిమాలు విడుదల అంటూ ఎప్పుడో డేట్స్ ఇచ్చేసారు అర్జున్, మహేష్. అలానే ఇద్దరు పోటాపోటీ ప్రమోషన్స్ చేస్తున్నారు కూడా. అయితే తాజా టాక్ ఏమిటంటే.. అల్లు అర్జున్, మహేష్ లు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు విడుదల డేట్ విషయంలో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా ఫిలింనగర్ టాక్. అయితే నిర్మాత దిల్ రాజే ప్లాన్ చేసి ఈ స్టార్ హీరోలిద్దరి రహస్య మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. ఆ మీటింగ్‌లో ఒకరు రెండు రోజులు ముందు... మరొకరు వెనక రావాలనే ఒప్పందం చేసుకున్నట్టుగా టాక్. అయితే ఎవరు ముందు ఎవరు వెనక అనేది మాత్రం రెండుమూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. 

Allu Arjun and Mahesh Babu Thinking about Their Movies Release:

Clash Between&nbsp;<span>Ala Vaikunthapurramloo and Sarileru Neekevvaru</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs