Advertisement
Google Ads BL

సందీప్ కిష‌న్ ‘A1 ఎక్స్‌ప్రెస్‌’ స్టార్టయింది


లాంఛ‌నంగా ప్రారంభమైన సందీప్ కిష‌న్ ‘A1 ఎక్స్‌ప్రెస్‌’: నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌

Advertisement
CJ Advs

‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం ‘A1 ఎక్స్‌ప్రెస్‌’. సోమ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, సందీప్ కిష‌న్‌ల‌పై  స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హ‌కీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. అలాగే ఈ జోన‌ర్‌లో సందీప్ కిష‌న్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె. ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

 

న‌టీన‌టులు:

సందీప్ కిష‌న్‌, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు,

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను

నిర్మాత‌లు:  టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం

బ్యాన‌ర్స్‌:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్

కో ప్రొడ్యూస‌ర్:  వివేక్ కూచిభొట్ల

మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌

కెమెరా:  కెవిన్ రాజు

ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌

ఆర్ట్‌:  అలీ

కాస్ట్యూమ్ డిజైన్‌:  హ‌ర్మ‌న్‌

పి.ఆర్‌.ఓ: ఎల్‌.వేణు గోపాల్‌, వంశీశేఖ‌ర్‌

Sundeep Kishan A1 Express Movie Launched:

Sundeep Kishan A1 Express Movie Opening Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs