ఎట్టకేలకు సినిమా రీ ఎంట్రీకి పవన్ కళ్యాణ్ పచ్చ జెండా ఊపాడు. పింక్ రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ షురూ అయ్యింది. కొన్నాళ్లుగా మేకప్ కి దూరమై రాజకీయాల వెంటపడిన పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉంటూనే ఇప్పుడు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా కొన్ని రోజులుగా హడావుడి జరుగుతుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొంతమంది దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ల కోసమే సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడంటున్నారు. ఎందుకంటే పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే కేటాయించాలన్న పవన్ కళ్యాణ్ కి మనీ కూడా అవసరమే. అందుకే అటు రాజకీయాలను ఇటు సినిమాలను బ్యాలెన్స్ చెయ్యాలనే నిర్ణయానికొచ్చారు.
అయితే రాజకీయాలతో పాటు సినిమాలంటే కుదిరేపని కాదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం కాస్త సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యి ఈ రీ ఎంట్రీ ప్లాన్స్ చేసాడు. అయితే సినిమాల కోసం రోజుకి కేవలం మూడు గంటల సమయమే దర్శకనిర్మాతలకు ఇవ్వబోతున్నాడట పవన్. అంటే పవన్ కళ్యాణ్ రోజుకి మూడు గంటల పాటే మేకప్ వేసుకుంటాడన్నమాట. మూడు గంటల తర్వాత సినిమా షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేసి.. రాజకీయాలతో పవన్ బిజీ అవుతాడట. మరి కేవలం మూడు గంటలతో పవన్ షూటింగ్ చెయ్యడం అంటే నిర్మాతకు తడిసి మోపెడవుతుంది. అయినా ఆయన క్రేజ్ ముందు అదో లెక్క. అందుకే నిర్మాతలు కూడా ఓకే అన్నారట.