Advertisement
Google Ads BL

‘మీకు మాత్రమే చెప్తా’ థియేటర్స్‌లో నవ్వులే నవ్వులు


నవ్వులతో హోరెత్తుతున్న ‘మీకు మాత్రమే చెప్తా’ థియేటర్స్ ...

Advertisement
CJ Advs

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా షామీర్ సుల్తాన్‌ దర్శకత్వంలో కింగ్ ఆఫ్ హిల్స్ పతాకంపై విజయ్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి  థియేటర్స్ ని నవ్వుల వానలో నింపుతున్నాయి. తమ ప్రయత్నానికి ఇంత ‘‘ఫన్ స్టాస్టిక్  హిట్’’ అందించిన ప్రేక్షకులను కలసి థ్యాంక్స్ చెప్పేందుకు టీం థియేటర్స్ ని విజిట్ చేసింది. హోెరెత్తుతున్న నవ్వులను నిశ్శబ్దంగా విన్న తరుణ్ భాస్కర్, అభినవ గోమటం, అవంతికశర్మ, పావని గంగిరెడ్డి ప్రేక్షకుల స్పందన వారికి గొప్ప అనుభూతులనిచ్చింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ: తరుణ్ భాస్కర్: ‘‘నిజాయితీగా చేసిన మా ప్రయత్నానికి ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన మాకు గొప్ప థైర్యాన్నిచ్చింది. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరితో కలసి కొన్ని సన్నివేశాలను చూడటం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వారి అభిమానం పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని క్లాస్ఆడియన్స్ కి మేము రీచ్ అయ్యాం అని

తెలుస్తుంది.  ప్రేక్షకులకు పెద్ద ధ్యాంక్స్’’ అన్నారు.

అభినవ గోమటం: ‘‘మా సినిమాని ఇంతలా ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులను చూస్తే నాకు మాటలు రావడం లేదు.. ప్రేక్షకుడిగా చాలా సినిమాలు గోల చేస్తూ చూసాను కానీ నేను నటించిన సినిమాకు ప్రేక్షకులు చేస్తున్న గోల ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ ని ఎంతగా కోరుకుంటున్నారో ఈ ఆదరణ చూస్తే తెలుస్తుంది.. మా రౌడి బాయ్స్ , గళ్స్ కు చాలా థ్యాంక్స్ ప్రేక్షకులను ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

అవంతికశర్మ మాట్లాడుతూ: ‘‘అద్భుతమైన స్పందన చూసాము.. సినిమా గురించి విన్న దానికి, నేరుగా ప్రేక్షకుల స్పందన చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగం అవడం నా అదృష్టం’’ అన్నారు. 

పావని గంగిరెడ్డి మాట్లాడుతూ: ‘‘ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్న తీరుని నేను ఊహించలేదు. మాకు వస్తున్న  స్పందన చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.. ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్’’ అన్నారు.

నటీనటులు :

తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్ తో పాటు అభినవ్ గౌతమ్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కుమార్, కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ, పిఆర్.వో : జి.ఎస్.కె మీడియా, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతినేని, నిర్మాతలు : విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ. రచన- దర్శకత్వం : షామీర్ సుల్తాన్

Meeku Matrame Chepta Team Visits Theaters:

Fun in Meeku Matrame Chepta Theaters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs