Advertisement
Google Ads BL

కొరటాల అంతటి సమర్ధుడేలే..!


రామ్ చరణ్ తన తండ్రి చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన సినిమాలన్ని చరణే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇటు హీరోగా అటు నిర్మాతగా రెండు పడవల మీద కాళ్ళేసిన చరణ్.. రెండింటీని బాగానే బ్యాలెన్స్ చేస్తున్నాడు. అయితే తాజాగా కొరటాలతో చిరు చెయ్యబోయే సినిమాకి కూడా చరణే నిర్మాత. కాకపోతే కొరటాల ఫ్రెండ్ నిరంజన్‌ రెడ్డి తో కలిసి చరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్, నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతలైనప్పటికీ... సినిమా నిర్మాణ వ్యవహారాలంతా దర్శకుడు కొరటాలే చూసుకుంటాడట. చరణ్ కేవలం మనీ పెడితే చాలు, మిగతా విషయాలన్నీ కొరటాల తన టీం తో కలిసి ఎంత ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో చూసుకుంటారట.

Advertisement
CJ Advs

అయితే కొరటాలకు నిర్మాణ రంగంలో అనుభవం ఉండడం, సినిమాని ఏ ఏరియాలో ఎంతకమ్మాలి అనే విషయాల్లో పట్టు ఉండడంతో.. రామ్ చరణ్ ఈ వ్యవహారాలన్నీ కొరటాలకే అప్పగించాడట. కొరటాలతో రెండేళ్లుగా చరణ్, చిరు ట్రావెల్ చెయ్యడంతో అతని మీద పూర్తి నమ్మకం ఏర్పడడంతోనే చరణ్ ఇలా సైడ్ అయ్యి.. కొరటాలకి టెన్షన్ తగిలించారని అంటున్నారు. ఇక కొరటాల గత సినిమాల వలే అనుకున్న బడ్జెట్ కి అటు ఇటు కాకుండా సినిమాని తీసి బిజినెస్‌ని కూడా క్లోజ్ చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు కావడం చరణ్ కి హెల్ప్ అయింది. అలా చరణ్ హ్యాపీ... ఇప్పుడు టెన్షన్ అంతా కొరటాలకే అన్నమాట.

Koratala Siva and Chiranjeevi Movie Latest Update:

Koratala siva Takes One more duty for Chiru Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs