Advertisement
Google Ads BL

రవితేజ 66వ చిత్రానికి మ్యూజిక్ ఎవరంటే?


ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

Advertisement
CJ Advs

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు.

ర‌వితేజ ‘కిక్’ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన త‌మ‌న్ అగ్ర సంగీత ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ర‌వితేజ హీరోగా చేసిన ప‌లు చిత్రాల‌కు త‌మ‌న్ సంగీతం అందించారు. తాజాగా మ‌రోసారి ర‌వితేజ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని, శృతిహాస‌న్ కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు రూపొందిన ‘బ‌లుపు’ చిత్రానికి కూడా త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ఆ చిత్రం మ్యూజికల్‌గా మంచి హిట్‌ను సాధించింది. కాగా ర‌వితేజ న‌టిస్తున్న ఈ 66వ చిత్రంలో ఆయ‌న ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నారు. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

న‌టీన‌టులు:

ర‌వితేజ‌, శృతిహాస‌న్‌

సాంకేతిక వ‌ర్గం:

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

నిర్మాత‌: ఠాగూర్ మ‌ధు

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని

SS Thaman for Ravi Teja, Gopichand Malineni’s RT66:

<span>Music composer SS Thaman has been signed to compose tunes for Mass Maharaj Ravi Teja&rsquo;s film with director Gopichand Malineni</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs