Advertisement
Google Ads BL

బిగ్‌బాస్-3: విన్నరెవరో తెలిసిపోయిందోచ్!


తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3లో విన్నర్ ఎవరు..? రన్నర్ ఎవరు..? అని ప్రేక్షకులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే బిగ్‌బాస్ విన్నర్ ఎవరనే దానిపై అధికారిక ప్రకటన వెలువడక ముందే లీకులు వచ్చేశాయ్. ఈ సీజన్‌కు పాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా నిలిచారు. అయితే ఎప్పట్నుంచో ఈ సీజన్‌లో కచ్చితంగా యాంకర్ శ్రీముఖినే గెలుస్తుందని అందరూ భావించారు. అయితే ఆమె రన్నర్‌కే పరిమితం అయ్యింది. కాగా.. నిన్నటితో ఓటింగ్ ముగియగా.. రాహుల్ సిప్లిగంజ్ భారీ మెజార్టీతో టైటిల్ విన్నర్‌గా నిలిచాడని నెట్టింట్లో అనధికారిక వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది. శ్రీముఖి ఓటింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది!. అయితే ఇది ఎంతవరకు నిజమో..? అనేది అధికారికంగా తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Advertisement
CJ Advs

ఈ షో ఫైనల్ ఎపిసోడ్ కూడా ముందు రోజే చిత్రీకరణ చేయడంతో ఈ విషయాలన్ని బయటికి వచ్చాయి. అయితే  బిగ్‌బాస్ హౌస్‌లో అందరికంటే ఎక్కువగా ఎంటర్‌టైన్ చేసిన వారి విషయానికి వస్తే.. ముందు వరసలో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్‌లే ఉంటారు. వీరిలో ఇంకా బాగా ఎంటర్‌టైన్ చేసిన వారిని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా రాహుల్, శ్రీముఖిలే అని చెప్పక తప్పదు. పునర్నవి ఉన్నంతకాలం రాహుల్ ఓ రియల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు చూపిస్తే.. ఆమె వెళ్లిన తర్వాత సింగర్‌గా యాక్టివ్‌గా ఉంటూ మార్కులు కొట్టేశాడు. శ్రీముఖి కూడా తన సాధ్యమైనంతగా ప్రయత్నించింది కానీ, ఆమె చేస్తున్న తీరు మాత్రం బిగ్ బాస్ కావాలని చేయిస్తున్నాడనే విషయం తెలిసిపోయేలా యాక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఆమెని పక్కన పెట్టేసి, రాహుల్‌కే కిరీటం అప్పగించారని తెలుస్తోంది. సో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ కిరీటాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకోబోతోంది మరెవరో కాదు.. రాహుల్ సిప్లిగంజే.

Who is The Bigg Boss 3 Winner?:

Rahul Winner.. Sree Mukhi Runner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs