Advertisement
Google Ads BL

బోల్డ్ అంటే చాలు భయపడిపోతోంది


RX 100 తో బోల్డ్ పాపగా పరిచయమైన పాయల్ రాజపుత్ కి స్టార్ అవకాశాలు దొరక్కపోయినా సీనియర్ హీరో వెంకటేష్ వెంకిమామ, రవితేజ డిస్కో రాజా సినిమాల్లో ట్రెడిషనల్ కేరెక్టర్స్ దొరికాయి. అయితే బోల్డ్ ముద్ర పడిన పాయల్ కి మళ్ళీ అలాంటి అవకాశాలు చాలానే వచ్చాయి. అందుకే RDX లవ్ సినిమాలో బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రకి ఓకే చెప్పింది. మరీ వల్గర్ గా RDX లవ్ లో కనబడిన పాయల్ ఆ సినిమా ఆమెకి పెద్ద షాకిచ్చింది. అందాలు ఆరబోస్తే సినిమాలు ఆడెయ్యవు, ప్రేక్షకులకు కావాల్సింది కంటెంట్ అని ఆ సినిమా నిరూపించింది. ఆ సినిమా తర్వాత కూడా పాయల్ కి అలా అందాలు ఆరబోసే, బోల్డ్ పాత్రలు రావడం మొదలయ్యాయట.

Advertisement
CJ Advs

అయితే ఓ కొత్త దర్శకుడు పాయల్ రాజపుత్ వద్దకు వెళ్లి మీకు చెప్పాలనుకుంటున్నది బోల్డ్ కథ అని ముందే క్లారిటీ ఇచ్చేసాడని... అయితే పాయల్ మాత్రం బోల్డ్ అయినా పర్లేదు కథ నచ్చితే చూద్దామని చెప్పి కథ చెప్పమని అడిగిందట. అయితే ఆ కొత్త దర్శకుడు చెప్పినా కథలో దాదాపుగా 5 నుండి 6 బెడ్ రూమ్ సన్నివేశాలు ఉండడంతో.. కాస్త భయపడిన పాయల్ రాజపుత్ ఆ కథని చెయ్యనని చెప్పిందట. ఎందుకంటే ఇలాంటి కథతోనే తాను RDX లవ్ సినిమా చేసి దెబ్బతిన్నానని... మళ్లీ వెంటనే అదే తరహా కథతో సినిమా చెయ్యనని తెగేసి చెప్పిందట ఎందుకంటే RDX లవ్ కథ మొదలెట్టినప్పుడు బోల్డ్ కథ అని చెప్పి చివరికి దాన్ని బూతు సినిమాగా మార్చేసాడని ఆమె ఆవేదన చెందుతుంది.  

Payal Rajput Feared with Bold Movies:

Payal Rajput Rejected Bold Content story  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs