కార్తీ ఖైదీ దెబ్బకి మిగతా సినిమాలు విలవిల్లాడుతున్నాయి. గత శుక్రవారం విడుదలైన ఖైదీ సినిమా మౌత్ టాక్ తోనే అదరగొట్టేస్తుంది. చాలా తక్కువ ప్రమోషన్స్ తో బాక్సాఫీసు వద్దకు వచ్చిన ఖైదీ థియేటర్స్ దుమ్ము దులుపుతుంది. కార్తీ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఖైదీ సినిమాని చాలా తక్కువ మొత్తానికి డబ్బింగ్ హక్కులను తెలుగు నిర్మాత కండిషన్స్ అప్లై అంటూ కొనుగోలు చేశారు. మరి నిర్మాత భయపడినట్లే మొదటి రోజు ఖైదీ ఓపెనింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఖైదీ టాక్ ని బట్టి రెండో రోజు, మూడో రోజు కూడా ఖైదీ కలెక్షన్స్ అదరడమే కాదు.. సోమ, మంగళ, బుధ వారాల్లోనూ ఖైదీ కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చాయి.
దానితో ఖైదీ సినిమా థియేటర్స్ కూడా పెరిగాయి. నైజాం లాంటి ఏరియాలలో ఖైదీ సినిమాకి థియేటర్స్ పెంచారంటే... ఇంక ఖైదీ కలెక్షన్స్ పెరగడం ఖాయమే అన్నట్టుగా ఉంది. అయితే ఖైదీకి ప్రమోషన్స్ లేవు, కానీ మౌత్ టాక్ తోనే ఖైదీ కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి అంటే నిజంగా మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఖైదీ చక్కని ఉదాహరణ. మరి కార్తీ గనక ఇంకాస్త ప్రమోట్ చేసి ఉంటే.. ఖైదీ సినిమా మరింత హిట్ అయ్యేదంటున్నారు. ఇక ఖైదీ తమిళనాట విజయ గర్వంతో వీర విహారం చేస్తుంది. ఈ సినిమాతో కార్తీ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. మరి త్వరలోనే కార్తీ ఖైదీ 2 అంటున్నాడు కూడా.