Advertisement
Google Ads BL

మరో చిన్న చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్


కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఎస్‌ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఒక పక్క నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా విడుదల కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఏషియన్ సునీల్ అర్జున్ సురవరం రిలీజ్ చేస్తున్నారు. ‘రాజావారు రాణిగారు’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ విడుదల చేస్తోంది.  థియేటర్లు వీరిద్దరూ కలిసి షేర్ చేసుకోనున్నారు. ఇన్సైడ్ టాక్ బాగున్నా ఈ రెండు సినిమాలు కూడా ఒకే డేట్‌కి రావటం మంచిదే కానీ వీకెండ్ కలెక్షన్స్ ఈ రెండు సినిమాలకు కీలకం కానున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు నవంబర్ 29న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

Advertisement
CJ Advs

Suresh Productions Supports to Raja Varu Rani Garu:

Suresh Productions Released Raja Varu Rani Garu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs