Advertisement
Google Ads BL

చిరు-కొరటాల కాంబోలో విలన్ ఎవరంటే..!


‘సైరా’ సూపర్ హిట్టవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి మంచి ఊపు మీదున్నారు. ఇక వరుస సినిమాలు చేస్తూ బిజిబిజీగా అవ్వాలని భావించిన మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్ కష్టాలు, మ్యూజిక్ డైరెక్టర్ కష్టాలు, సినిమా స్టోరీ లీకైపోయింది.. ఇలా పలు రకాలుగా వార్తలు వినవిచ్చిన విషయం విదితమే. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అదేమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్‌ను ఢీ కొట్టేది (విలన్) ఎవరనేదే.

Advertisement
CJ Advs

వాస్తవానికి మన తెలుగు డైరెక్టర్స్ టాలీవుడ్‌కు చెందిన నటీనటులను ఎప్పుడో దాదాపు మరిచిపోయారన్న విషయం తెలిసిందే. అటు కోలీవుడ్ నుంచి గానీ లేదా బాలీవుడ్ నుంచి ఎక్కువగా విలన్స్‌, హీరోయిన్స్‌ను పట్టుకొస్తున్నారు. అయితే తాజాగా కొరటాల కూడా కోలీవుడ్‌లో ఇద్దరు స్టార్‌ల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కవుట్ అవ్వలేదట. వారిలో ఒకరు విజయ్ సేతుపతి కాగా మరొకరు అరవింద్ స్వామి. సేతుపతి ఇప్పటికే సుక్కు-బన్నీ కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ పాత్రలో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అది కన్ఫామ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక స్వామి విషయానికొస్తే.. ఇప్పటికే పలు చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించడం.. రామ్ చరణ్‌తో ‘ధృవ’లో విలన్‌గా చేయడంతో.. చిరు సినిమాలో చేయాలని చిత్రబృందం సంప్రదించగా..‘సారీ సార్ ఆల్రెడీ నేను హీరోగా సినిమాకు కమిట్ అయ్యాను’ అని సింగిల్ మాటతో తేల్చేశారట.

దీంతో చేసేదేమీ లేక మళ్లీ టాలీవుడ్‌కు వెనుదిరిగిన కొరటాల ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా మారిన జగపతి బాబును సంప్రదించినట్లు తెలుస్తోంది. మొదట అటు చిరు.. ఇటు జగపతి ఇద్దరూ విలన్‌గా అని కాసింత మొహమాటపడ్డారట. చిరును తాను ఢీ కొనడమేంటి అంటి జగపతి నవ్వుకున్నారట. అయితే చిరుతో కలిసి నటించినట్లూ ఉంటుందని భావించిన జగపతి బాబు చివరికి కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంటే చిరు-కొరటాల కాంబో మూవీకి విలన్ దొరికేశాడన్న మాట. అయితే ఈ సంప్రదింపులన్నీ ఫోన్‌లో మాత్రమే జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Chiru-Koratala Combo Movie.. Villain Details Here:

Chiru-Koratala Combo Movie.. Villain Details Here
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs