Advertisement
Google Ads BL

డైరెక్టర్‌‌కు దండం పెట్టి పంపిన పాయల్ పాప!


‘ఆర్ఎక్స్‌-100’ సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన హాట్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ హాట్ హాట్ పాత్రలతో దూసుకెళ్తోంది. దీంతో హాట్ చిత్రాల్లో తప్ప మిగతా సినిమాల్లో పాయల్ చేయదేమోనని.. బోల్డ్ పాత్రలుంటేనే ఆమె దగ్గరికెళ్తున్నారు డైరెక్టర్స్. ఇలాంటి పాత్రలకే పరిమితం కావడంతో ‘బోల్డ్‌కు కేరాఫ్ అడ్రస్’ అయిపోయింది. ఆర్ఎక్స్-100, ఆర్డీఎక్స్ లవ్ మధ్యలో ఐటెం సాంగ్స్ ఇలా అన్నీ బోల్డ్‌గానే ఉండటంతో కొందరు డైరెక్టర్స్.. ‘మేడం మా సినిమాలో బోల్డ్ పాత్ర ఉంది చేస్తారా’ అని అడుగుతున్నారట. దీంతో విసిగి వేసారిపోయిన ఈ ముద్దుగుమ్మ కీలక నిర్ణయం తీసుకుందట.

Advertisement
CJ Advs

ఇకపై బోల్డ్ పాత్రల్లో నటించకూడదని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయిపోయిందట. ఇందుకు ఓ బలమైన కారణం ఉందట. ఇటీవల ఓ డైరెక్టర్ ఆమె దగ్గరికెళ్లి వచ్చీ రావడంతోనే ఇది బోల్డ్ కథ అని స్టార్ట్ చేసి నెరేషన్ మొదలు పెట్టాడు. తీరా చూస్తే ఒకట్రెండు కాదు ఏకంగా ఐదు బెడ్రూమ్ సీన్లు ఉండటంతో ‘నీకో దండం.. నీ స్టోరీకో దండం సార్.. ఇక దయచేయండి’ అని చెప్పి పంపేసిందట. అంతేకాదు మీరు చెప్పినంత రెమ్యునరేషన్ ఇస్తామని సదరు డైరెక్టర్ బ్రతిమలాడినా వద్దంటే వద్దు.. ఇలాంటి సినిమాల్లో ఇక చేయకూడదని డిసైట్ అయ్యానని పాయల్ పాప తెగేసి చెప్పేసిందంట. అయితే ఆ డైరెక్టర్ ఎవరు..? ఇంతకీ ఏ సినిమా..? అనేది ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా.

ఇటీవల వచ్చిన ఆర్డీఎక్స్ లవ్ సినిమా విషయంలోనూ తప్పు చేశానని అందుకే ఇక నుంచి మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుని నటించాలని ఉందని చెప్పిందట. తనకు తగ్గట్లుగా దర్శకులు కూడా అలాంటి కథలు తీసుకొస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని పాయల్ చెబుతోంది. కాగా.. ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం మాస్ మహారాజ్‌ రవితేజ హీరోగా వస్తున్న ‘డిస్కోరాజా’, ‘వెంకీ మామ’ చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ రెండు సినిమాలు ఈ హాట్ పాపకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడతాయో..? అసలు ఇకపై ఈ బ్యూటీ దగ్గరికి ఎలాంటి కథలతో డైరెక్టర్స్ వెళతారో..? కండిషన్స్ అప్లై అంటున్న ఈ పాపను ఏ మాత్రం దర్శకులు సంప్రదిస్తారో..? వేచి చూడాల్సిందే.

News About Bold Bhama Payal Rajput!:

News About Bold Bhama Payal Rajput!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs