Advertisement
Google Ads BL

మరో వీడియోతో హాట్ టాపిక్ అయిన శ్రీరెడ్డి!


టాలీవుడ్ వివాదాస్పద నటిగా పేరుగాంచిన శ్రీరెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలియదు.. ఎప్పుడు ఎవరి బాగోతాలు ఆధారాలతో సహా బయటపెడుతుందో తెలియట్లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు, ఒకరిద్దరు రాజకీయ నాయకుల జాతకాన్ని బయటపెట్టి సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈమె ఇన్నెన్ని ఆరోపణలు చేసినా ఒక్కరంటే ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే క్యాస్టింగ్ కౌచ్ హడావుడి తర్వాత హైదరాబాద్‌ను పూర్తిగా వదిలేసిన చెన్నై చెక్కేసింది. అయితే వివాదాలకు.. వివాదాస్పద పోస్టులకు మాత్రం ఫుల్‌స్టాప్ పెట్టలేదు.. అక్కడ్నుంచే సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తోంది.

Advertisement
CJ Advs

దీపావళి సందర్భంగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. దానికి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. ‘అందరు పసుపతుల కోసం నేను సరైన పనే చేశాను. నా అమాయక మహిళలు అందరికీ నేను గద్వాల అరుంధతిని’ అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చుకుంది.  అంటే తనను తానుగా ‘అరుంధతి’గా పోల్చుకుంటోందన్న మాట. అంతేకాదు.. అరుంధతికి తగ్గట్టుగానే డ్రెస్ కూడా వేసుకున్న శ్రీరెడ్డి.. హారతి ఇస్తున్నట్లు వీడియోలో ఉంది. కాగా అనుష్క సినిమాలో పసుపతి, అరుంధతి పాత్రల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంటే తన జీవితంలోకి వచ్చిన వారందర్నీ శ్రీరెడ్డి పసుపతులతో పోల్చి.. తనకు తానుగా అరుంధతిలాగా ఫీలవుతోందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

కాగా.. ఈ పోస్ట్‌పై పలువురు ఆమె వీరాభిమానులు మెచ్చుకుంటుండగా.. మరికొందరు బూతుల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇలా వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం ఈ హాట్‌కు కొత్తేమీ కాదు.. ఒక్కసారి ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూస్తే పరిస్థితేంటో మీకే అర్థమవుతుంది. మున్ముంథు మరెన్ని వీడియోలు, మాటలు, ఫొటోలను బయటపెట్టి హల్‌చల్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Sri Reddy Posts Again Video.. Details Here..:

Sri Reddy Posts Again Video.. Details Here..  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs