Advertisement
Google Ads BL

‘రాగ‌ల 24 గంట‌ల్లో’ రిలీజ్‌కు రెడీ


‘రాగ‌ల 24 గంట‌ల్లో’ సినిమాకు యూ బై ఏ సర్టిఫికేట్.. నవంబర్ 15న విడుదల..

Advertisement
CJ Advs

సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం ‘రాగ‌ల 24 గంట‌ల్లో’. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్‌పై `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. దీనికి యూ బై ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 15న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ - ‘‘సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. న‌వంబ‌ర్ 15న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. నన్ను నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా నిర్మాత శ్రీనివాస్ కానూరు మంచి అభిరుచి గల నిర్మాత. ప్యాషన్ తో ఈ సినిమాని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రఘు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. సినిమా అన్ని వ‌ర్గాల‌ను మెప్పించేలా ఉంటుంది’’ అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ - ‘‘సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో ఈ రంగంలోకి అడుగు పెట్టాను. న‌వంబ‌ర్ 15న‌ ‘రాగ‌ల 24 గంట‌ల్లో’ వంటి మంచి సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను తొలి చిత్రంగా ప్రేక్ష‌కుల‌కు అందించ‌డం ఆనందంగా ఉంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రూ మంచి స‌హ‌కారాన్ని అందించారు.  చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు.

న‌టీన‌టులు:

సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి, అదిరే అభి తదితరులు.

సాంకేతిక వ‌ర్గం:

స్క్రీన్ ప్లే-డైరెక్షన్: శ్రీనివాస్ రెడ్డి

ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కానూరు

లైన్ ప్రొడ్యూసర్: యం. ఎస్. కుమార్

ఎడిటర్: తమ్మిరాజు

కెమెరా: గ‌రుడ‌వేగ అంజి

ఆర్ట్: చిన్నా

సంగీతం: రఘు కుంచె

కథ: వై.శ్రీనివాస్ వర్మ

మాటలు: కృష్ణభగవాన్

పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి

ఫైట్స్: విక్కీ

డాన్స్: స్వర్ణ, భాను

Ragala 24 Gantallo Censor Completed:

Ragala 24 Gantallo Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs