Advertisement
Google Ads BL

అల్లూవారి ఆస్తుల పంపకాలపై శిరీష్ క్లారిటీ!


టాలీవుడ్‌లో టాప్ నిర్మాతగా ఓ వెలుగు వెలుగుతున్న అల్లు అరవింద్ ఇంట్లో విభేదాలు వచ్చాయని.. ఇక చేసేదేమీ లేక ఆస్తులు పంచేసుకుని.. ఎవరికి వారుగా కొత్త కుంపట్లు పెట్టారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదేదే సామెత ఉంది కదా.. పళ్లు ఉన్న చెట్టుకు రాళ్లు పడుతుండటం మామూలే అన్నట్లుగా.. సెలబ్రిటీలపై గాసిఫ్స్.. లేనిపోని వార్తలు పుట్టడం షరామామూలేనని అందరూ భావించినప్పటికీ ఎక్కడో తేడా కొట్టింది.! మరోవైపు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకునే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంపై రియాక్ట్ అవ్వకపోవడం.. అల్లు అరవింద్ కూడా ముభావంగా ఉండటంతో సినీ పెద్దలే ఇదంతా నిజమేనని భావించారట. వాస్తవానికి అల్లు అర్జున్ కొత్త ఆఫీసు స్థాపించడం, సొంత బ్యానర్ పై సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడం, తర్వాత సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ‘అల్లూ ఇంట ఆస్తిపంపకాలు’ అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో అందరూ ఇది వాస్తవమేనని భావించారు.

Advertisement
CJ Advs

అయితే అసలేం జరిగింది..? ఎక్కడ తేడా కొట్టిందబ్బా..? అని ఎంత ఆలోచించినా అల్లు కాంపౌండ్‌కు బాగా దగ్గరున్న వాళ్లు కూడా ఆలోచనలో పడ్డారట. ఈ వ్యవహారం రోజురోజుకూ ముదరడం.. వార్తలు కథనాలు కథనాలుగా పుట్టుకొస్తుండటంతో ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించిన అల్లువారి చిన్నబ్బాయ్.. అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించి క్లారిటీ ఇచ్చేశాడు. ఇద్దరు అన్నయ్యలతో నవ్వుతూ.. తాను నవ్వుతూ ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన చిన్నబ్బాయ్ పరోక్షంగా ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చాడు. ‘వన్ టూ.. అండ్ త్రీ.. నిన్న రాత్రి బ్రదర్స్’ అని రాసుకొచ్చాడు. 

అంటే.. మేమంతా ఒక్కటే.. ఒక్కటిగా ఉన్నాం అనవసరంగా ఏవేవో వార్తలు రాసేసి ఆగం కాకండి.. వేరే బ్యానర్లు ఉండొచ్చుగాక.. మేం ముగ్గురం ఒక్కటే అల్లు బ్రదర్స్ అంతే అని పరోక్షంగా అల్లు శిరీష్ చెప్పాడని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదేదో ఇంగ్లీష్‌లో సామెత ఉంది కదా.. ఒక ‘A Picture is worth a thousand words’ అన్నట్లు సింగిల్.. మూడు పదాలతో తన ఫ్యామిలీపై వస్తున్న ఆస్తుల పంపకాల రూమర్స్‌‌కు అల్లువారబ్బాయ్ ఫుల్‌స్టాప్ పెట్టేశారన్న మాట. అల్లూ బ్రదర్స్ ఆల్ ఈజ్ వెల్ అయితే ఇక అల్లూ, మెగా ఫ్యాన్స్ ఆల్ హ్యాపీసే.

Allu Sirish Gives Clarity Over Assets distributes:

Allu Sirish Gives Clarity Over Assets distributes  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs