Advertisement
Google Ads BL

ఆ ఇద్దరు నటులు ఆర్జీవీకి షాకిచ్చారా!?


టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, సంచలనాకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ కొత్త చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. వివాదాలే ఊపిరిగా భావించే ఆర్జీవీ ఇలాంటి వివాదాస్పద సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల రీలీజ్ అయిన ట్రైలర్‌లో ఇరు పార్టీ నేతలను క్రూరాతి క్రూరంగా చూపించడం గమనార్హం. దీపావళికి ఆర్జీవీ పేల్చిన ట్రైలర్ బాంబు గట్టిగా పేలింది.. మిలియన్లలో వ్యూస్ వచ్చాయ్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

Advertisement
CJ Advs

>ఈ సినిమాలో అచ్చుగుద్దినట్లుగా వైఎస్ జగన్, చంద్రబాబు, కేఏ పాల్, పవన్ కల్యాణ్‌, నారా లోకేష్‌లను దింపేశారు. మరోవైపు స్పీకర్‌గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాంను కమెడియన్ అలీ రూపంలో దించేశారు. అయితే ఇంతవరకూ అంతా ఓకే గానీ.. సినిమాలో నటించాలని ఇండస్ట్రీకి ఓ ఇద్దరూ ప్రముఖ కమెడియన్స్‌ను సంప్రదించగా మొదట ఓకే అన్న వాళ్లు.. పాత్ర చెప్పగా అబ్బో మేం అస్సలు చేయలేం బాబోయ్ అని తిన్నగా తప్పించుకున్నారట. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. ఇటు టాలీవుడ్‌లో.. అటు వైసీపీలో ఓ వెలుగు వెలుగుతున్న నటులని టాక్ నడుస్తోంది. వీరిలో ఒకరు కీలక పదవిలో ఉండగా.. మరొకరు పదవి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్లతో వేచిచూస్తున్నారు. ఈ చిన్న క్లూతో ఆ ఇద్దరు నటులు ఎవరో అర్థమైపోయింటుంది.

>వాస్తవానికి అటు టీడీపీని.. ఇటు వైసీపీని ఓ రేంజ్‌లో ట్రైలర్‌లో ఏకిపారేశారు. ఈ ట్రైలర్‌ చూసిన తర్వాత ఆ ఇద్దరు నటులు.. హమ్మయ్యా ఈ సినిమాలో నటించకపోవడమే మంచిదైంది లేకుంటే వైసీపీ నేతలు మనల్ని ఎన్నెన్ని మాటలు అనేవారో అని ఒకరికొకరు చెప్పుకున్నారట. మరి మున్ముంథు ఎన్నెన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తాయో..? ఇంకెన్ని ట్విస్ట్‌లు వర్మ ఇస్తారో వేచి చూడాల్సిందే.

Two Comedians Gives Shock To Director RGV!:

<sup>Two Comedians Gives Shock To Director RGV!</sup> <div><sup><br /></sup></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs