Advertisement
Google Ads BL

118 చిత్ర బ్యానర్‌‌లో మళ్లీ కళ్యాణ్ రామ్ చిత్రం


118 హిట్ తరువాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ 

Advertisement
CJ Advs

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ సంవత్సరం యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘118’ తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా అటు విశ్లేషకులను ఇటు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరొకసారి పట్టాలెక్కబోతోంది. ఇటీవలి కాలంలో తమిళ్ స్టార్ విజయ్ నటించిన ‘విజిల్’ చిత్రాన్ని తెలుగులో దిగ్విజయంగా సమర్పించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. 

నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ - ‘‘సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘విజిల్’ చిత్రాన్ని దీపావళికి తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసాము. ఈ చిత్రం భారీ వసూళ్లతో, చక్కటి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ శుభసందర్భంలో మా బ్యానర్ లో మరొక కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌ గారు మా బ్యానర్ కు ‘118’ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇప్పుడు మళ్ళీ మా బ్యానర్ లో ఒక చిత్రాన్ని చేయబోతున్నారు. ఒక కొత్త తరహా కథతో రూపొందబోతున్న ఈ చిత్రం వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని అన్నారు.

Kalyan Ram Again doing Movie in East Coast Productions Banner:

Kalyan Ram New Film Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs